Spread the love

మీకు సొంతింటి పంటలపై ఆసక్తి డాబాసాగుపై అభిరుచి ఉందా ? ప్రారంభించే పద్ధతులు నిర్వాహణ మెళకువలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? అయితే మీలాంటి వారి కోసమే ఇంటిపంటల పెంపకంపై అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తోంది. 2019 జనవరి 12న శనివారం, ఖైరతాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్ లోని రైతునేస్తం కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్ల పెంపకంపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బకెట్ గార్డెన్ నిపుణులు రవిచంద్ర పాల్గొంటారు. ఈ కార్యక్రమం సాయంత్రం 3 : 30 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ఆసక్తి ఉన్న వారు ముందుగా ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవచ్చు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 7093 973 999