Spread the love

వెనకటి కాలానికి, నేటికీ ఆహార అలవాట్లలో ఎన్నో మార్పులు అందుకే నేడు అనేక రోగాలు ఈ పరిస్థితుల్లో… వెంటాడే అనారోగ్య సమస్యలు పోవాలన్నా.. సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలన్నా.. మన ముందు ఉన్న ఏకైక మార్గం దేశీ ఆహారం, ప్రకృతితో జీవన విధానం మరి ఈ బాటలో ఎలా సాగాలి ? ఏ ఆహారం ఎలా తీసుకోవాలి ? ఇలాంటి అనేక ఆరోగ్య, ఆహార అంశాలపై అవగాహన కల్పించేందుకు జూన్ 2, 3 తేదీల్లో రైతునేస్తం ఫౌండేషన్… వెంకటిగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నగరాల్లో.. స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి గారిచే… సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులు నిర్వహిస్తోంది. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, విష జ్వరాలు తదితర ఆధునిక రోగాలు, వాటికి కారణాలు, సిరిధాన్యాలతో నిర్మూలన – నియంత్రణపై ఖాదర్ వలి అవగాహన కల్పిస్తారు. సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కార్యక్రమాలు జరిగే తేదీ, సమయం, వేదికలు…. జూన్ 2న ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉదయం 9 : 30 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు వేదిక : పద్మశాలి కళ్యాణ మండపం, వెంకటగిరి, నెల్లూరు జిల్లా. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు – 9959577280, 9440401303, 9676797777 జూన్ 2న ఆదివారం తిరుపతి, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వేదిక : మహతి కళాక్షేత్రం, ప్రకాశం రోడ్, తిరుపతి సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు – 9949952020, 9676797777 జూన్ 3 సోమవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, ఉదయం 9 : 30 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు వేదిక : వరదరాజులస్వామి దేవాలయ ఆవరణ, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు – 8886902902, 9676797777 వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో జరిగే సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులకు అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. వేదికల వద్ద సిరిధాన్యాలైన అండుకొర్రలు, కొర్రలు, ఆరికెలు, ఊదలు, సామలు, సేంద్రియ ఉత్పత్తులు, వ్యవసాయ, అనుబంధ రంగాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి