Spread the love

మిద్దెతోటను ప్రారంభించాలని అనుకుంటున్నారా…?

ఇంటిపంటలను పండించే మెళకువలు తెలుసుకోవాలని ఉందా…?

కూరగాయలు, పండ్లు, తీగజాతి మొక్కలను ఎలా పెంచుకోవాలి…?

ఈ సందేహాలకు సమాధానమిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లోని రైతునేస్తం కార్యాలయంలో సెప్టెంబరు 22, 2018 శనివారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కేవలం 80 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. హాజరుకాబోయే వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కొరకు 70939 73999 ఫోన్‌ నెంబరును సంప్రదించగలరు.