Spread the love

రైతు.. దేశానికి వెన్నెముక
ఆకలి తీర్చే అన్నదాత

అందుకే.. కర్షకుల సంక్షేమమే
పాలకుల ప్రథమ కర్తవ్యం

సాగు అనుకూల విధానాలతో
నాటి నుంచి నేటి వరకు
అనేక మంది పాలకులు రైతు బాంధవులయ్యారు

వారిలో అగ్రభాగాన నిలుస్తారు
మాజీ ప్రధానమంత్రి ఛౌదరీ చరణ్ సింగ్

రైతు నాయకుడిగా
హక్కుల సాధన యోధుడిగా
ఉద్యమాల సారథిగా
చరణ్ సింగ్.. చిరస్మరణీయులు

ఆ మహానేతపై డాక్టర్ యలమంచలి శివాజీ కలం నుంచి జాలువారిని పుస్తకం..
“గాంధీ పథంలో.. కర్షక ప్రధాని”.

రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తక ఆవిష్కరణ కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఛౌదరీ అజిత్ సింగ్ చేతుల మీదుగా సెప్టెంబర్ 6న ఉదయం 10:30 గంటలకు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే.

వేదిక – ది ఇండియన్ టుబాకో అసోసియేషన్ హాల్, జి.టి. రోడ్, శ్రీనివాసరావుతోట, గుంటూరు.