Spread the love

మిరప, వరి సాగు | కషాయాలు, మిశ్రమాల పై శిక్షణా కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

మిరప, వరి సాగు | కషాయాలు, మిశ్రమాల పై శిక్షణా కార్యక్రమం

September 1 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

వరి, మిరప సాగులో తక్కువ పెట్టుబడి, నాణ్యమైన దిగుబడి, మార్కెట్లో అధిక రాబడి కి ప్రకృతి, సేంద్రియ వ్యవసాయమే ఉత్తమ విధానం.

మరి ఈ పద్ధతిలో సాగేదెలా ?

ఉపయోగించే కషాయాలు, మిశ్రమాలేవి ?

తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు .. రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఈ వారం సెప్టెంబర్ 1 ఆదివారం నిర్వహిస్తోన్న.. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో మిరప, వరి సాగు.. వివిధ రకాల కషాయాలు, మిశ్రమాల తయారీ, వాడకంపై రైతు శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీమతి లావణ్యా రమణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో మిరప, వరి సాగుపై రైతులకు శిక్షణ ఇస్తారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, మిశ్రమాల తయరీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.

ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 3 83 666, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X