Spread the love

ఏపీ రైతు దినోత్సవం – జూలై 8 – వైఎస్ఆర్ రైతునేస్తం అవార్దుల ప్రదానోత్సవం

Loading Events

« All Events

  • This event has passed.

ఏపీ రైతు దినోత్సవం – జూలై 8 – వైఎస్ఆర్ రైతునేస్తం అవార్దుల ప్రదానోత్సవం

July 8 @ 10:00 am - 5:00 pm at

అన్నదాతల ఆప్తుడు, వ్యవసాయంలో విప్లవాత్మక పథకాలకు ఆద్యుడు, దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి. జూలై 8న ఆ మహానేత జయంతి.

ఈ నేపథ్యంలోరైతు బాంధవుడు రాజన్న జయంతిని పురస్కరించుకొని ఆ రోజుని రైతు దినోత్సవంగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. రైతులకు సాగు సమాచార వారదిగా సేవలందిస్తున్న రైతునేస్తం మాస పత్రికరైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తలపించింది. ఇందులో భాగంగా జూలై 8న ఉదయం 10 గంటల నుంచి గుంటూరు పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిర్ లో రైతునేస్తం ఆధ్వర్యంలో ఉచితంగా సిరిధాన్యాల విత్తనాల పంపిణీ, యంత్ర పరికరాల ప్రదర్శన, మరియు ఉత్తమ రైతులను ఎంపిక చేసి వై.యస్.ఆర్. రైతునేస్తం పురస్కారాల పేరిట అవార్డులు ప్రదానం చేయనుంది.

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలనపై స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి గారిచే అవగాహన కార్యక్రమం జరుగుతుంది.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్, రైతు నాయకులు ఎంవీ ఎస్ నాగిరెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్, ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎం. కోదండరెడ్డి, ప్రముఖ రైతు నాయకులు, మాజీ ఎంపీ శ్రీ యలమంచలి శివాజీ, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి తదితరులు పాల్గొంటారు.

రైతు దినోత్సవంలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. మధ్యాహ్నం భోజన సదుపాయం కలదు. మరిన్ని వివరాలకు 9849 312 629, 7093 973 999, 9676 797 777, 9705 383 666, 0863 – 2286255 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.

Event Navigation

X