Spread the love

నీటి నిల్వ, వాన నీటి పొదుపు, నీటి కుంటల ప్రాముఖ్యతపై రైతు అవగాహన కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

నీటి నిల్వ, వాన నీటి పొదుపు, నీటి కుంటల ప్రాముఖ్యతపై రైతు అవగాహన కార్యక్రమం

April 28 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

ఓ వైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు నీరు లేక వెలవెలబోతున్న జలవనరులు ఈ నేపథ్యంలో రానున్న వర్షాకాలంలో ఆకాశం నుంచి జాలువారే ప్రతి వర్షపు చినుకుని ఒడిసి పడితేనే.. సాగు సాగుతుంది.

మరి వాన నీటిని ఎలా నిల్వ చేసుకోవాలి ? పొలంలో నీటి చుక్కలను పొదుపు చేసే పద్ధతులేవి ?

ఈ అంశాల్లో సమగ్ర వివరాలను రైతులకు తెలియజేసేందుకు రైతునేస్తం ఏర్పాటు చేస్తోందినీటి నిల్వ, వర్షపు నీటిని పొదుపు చేయడం, నీటి కుంటల ప్రాముఖ్యత, నీటి సంరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులపై రైతు అవగాహన కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2019 ఏప్రిల్ 28న ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది.

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ డాక్టర్ శ్యాం సుందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. నీటి కుంటల నిర్మాణం, నీటి నిల్వ, సంరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు, పంటలకు చేకూరే ప్రయోజనాలను వివరిస్తారు. వాన నీటిని నిల్వ చేసుకునే విధానాలపై పూర్తి అవగాహన కల్పిస్తారు.

ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 383 666, 0863 – 2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Details

Date:
April 28
Time:
10:00 am - 4:00 pm
Event Tags:
, , ,
Website:
http://www.rythunestham.com

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా.

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X