Spread the love

చిరుధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ – రైతు పంచాంగ శ్రవణం

Loading Events

« All Events

  • This event has passed.

చిరుధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ – రైతు పంచాంగ శ్రవణం

April 6 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

చిరుధాన్యాల సాగులో…… తక్కువ పెట్టుబడి….. అతి తక్కువ నీటి వినియోగం….. తద్వారా రైతుకి ఆదాయం.  ప్రకృతి వనరుల సంరక్షణ సాధ్యం.. అనారోగ్యాలతో నేటి సమాజం ఆధునిక ఆహారం వదిలి తిరిగి మన పూర్వీకుల ఆహారం వైపు మళ్లుతున్న నేపథ్యంలో… చిరుధాన్యాలకు ఆదరణ పెరిగింది. పండించే రైతులకి మంచి ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో… మీరు కూడా చిరుధాన్యాలు సాగు చేయాలని చూస్తున్నారా.. ? పండించే పద్ధతులు, నేరుగా విక్రయించగలిగే విధానాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా .. ? అయితే.. రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో… గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమానికి హాజరుకండి.

రైతు శిక్షణా కార్యక్రమాలు 149 వారాలు పూర్తి చేసుకొని 150వ వారంలోకి అడుగిడుతున్న సందర్భంగా 2019 ఏప్రిల్ 6న శనివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా… ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్య పంటల సాగు మరియు మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీపై రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే… రైతు పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు, కడప జిల్లా ప్రాకృతిక రైతు, చిరుధాన్యాల సాగు నిపుణులు విజయ్ కుమార్ పాల్గొంటారు. విజయ్ కుమార్ ప్రకృతి వ్యవసాయంలో ఉత్తమ రైతుగా రైతునేస్తం నుంచి అవార్డు అందుకున్నారు. క్షేత్రస్థాయిలో చిరుధాన్యాల సాగుపై రైతులకి అవగాహన కల్పిస్తున్నారు. సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత.. ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల పంటల సాగుపై రైతులకి శిక్షణ ఇస్తారు. చిరుధాన్యాల సాగు మెళకువలు, మార్కెటింగ్ లో రైతులకు ఉన్న అవకాశాలను యడ్లపల్లి వెంకటేశ్వరరావు వివరిస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాలను వివరిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. రైతులకు చిరుధాన్యాల విత్తనాలు అందుబాటులో ఉంటాయి.

శిక్షణా కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునేవారు 9705 383 666, 0863 – 2286255 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X