Spread the love

“సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం – దేశీ ఆహారంతో ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలన” పై అవగాహన సదస్సులు

Loading Events

« All Events

  • This event has passed.

“సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం – దేశీ ఆహారంతో ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలన” పై అవగాహన సదస్సులు

September 30, 2018 - October 2, 2018 at

మారిన ఆహారపు అలవాట్లు మానవ సమాజానికి అతిపెద్ద ముప్పుగా మారాయి. ఆహార పదార్థాల్లో రసాయనాలు, పోషకాల లేమి మధుమేహం, బీపీ, క్యాన్సర్ తదితర రోగాలకు కారణం అవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం.. దేశీ ఆహారమైన సిరిధాన్యాలే. ఈ నేపథ్యంలోనే సంపూర్ణ ఆరోగ్యం కోసం సిరిధాన్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ కృషి చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరుస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, 2న గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం నగరాల్లో “సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం – దేశీ ఆహారంతో ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలన” పై అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని సిరిధాన్యాలు, కషాయాలతో.. ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు.

కార్యక్రమం జరిగే తేదీలు, సమయం, ప్రాంతాల వివరాలు….

 

☛ సెప్టెంబర్ 30 ( ఆదివారం ) – ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు
వేదిక – వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలోని బాలాజీ మండపం, బృందావన్ గార్డెన్స్, 5వ లైను, గంటూరు.

 

☛ సెప్టెంబర్ 30 (ఆదివారం) – సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి  7  గంటల వరకు
వేదిక – పి.బి.సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం, మొగల్రాజపురం, విజయవాడ.

 

☛ అక్టోబర్ 1 (సోమవారం) – ఉదయం  10  గంటల నుంచి మధ్యాహ్నం  1  గంటల వరకు
వేదిక – శ్రీ గేదెల నూకరాజు కళ్యాణ మండపం, మెయిన్ రోడ్, ఎ.సి.గార్డ్స్, రాజమండ్రి.

 

☛ అక్టోబర్ 1 (సోమవారం) – సాయంత్రం 4  గంటల నుంచి రాత్రి  7  గంటల వరకు
వేదిక – అల్యూమ్ని ఆడిటోరియం హాల్ , జేఎన్ టీయూ, కాకినాడ

 

☛ అక్టోబర్ 2 (మంగళవారం) – మధ్యాహ్నం  3  గంటల నుంచి  రాత్రి  7  గంటల వరకు
వేదిక – ఏయూ కాన్వకేషన్ హాల్, సిరిపురం జంక్షన్, హెచ్ పీ పెట్రోల్ బంక్ ఎదురుగా, విశాఖపట్నం.

కార్యక్రమం జరిగే వేదిక వద్ద సిరిధాన్యాలైన అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, అరికెలు…. వ్యవసాయ – అనుబంధ రంగాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.

కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.

మరిన్ని వివరాలకు 9849 312629, 9676 797777, 7093 973999 నెంబర్లలో సంప్రదించగలరు.

Details

Start:
September 30, 2018
End:
October 2, 2018
Event Tags:
, , , , , , ,

Event Navigation

X