Spread the love

కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం

November 10 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

వ్యవసాయంలో రైతుకి కావాల్సింది

ఆర్థిక చేయూత

మద్ధతు ధరలు

అండగా నిలిచే బీమా

సాగులో కొత్త పద్ధతులపై శిక్షణ

ఈ అంశాల్లో ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నా.. అవగాహన లేక రైతన్నలు సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఆయా పథకాలపై సమగ్ర అవగాహన ఉంటే రైతులు ఇబ్బందులను అధిగమించి ఆదాయం పొందగలరు.

ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం అమలు చేస్తున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మరియు రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్తంగా… కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలపై నవంబర్ 10న ఆదివారం… అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ అవగాహన కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాల కేంద్ర క్షేత్ర ప్రచార అధికారి నాగసాయి సూరి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, జాతీయ వ్యవసాయ మార్కెట్ “ఈ – నామ్ ”, జలశక్తి అభియాన్, గోబర్ ధన్ యోజన తదితర పథకాలు… కనీస మద్దతు ధర, కృషి విజ్ఞాన కేంద్రాలు, కిసాన్ కాల్ సెంటర్లు, వ్యవసాయ అనుబంధ రంగాలు – పాడి, పట్టు, కోళ్లు, చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకాలు, కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఆయా పథకాల ద్వారా లబ్ది పొందే మార్గాలను తెలియజేస్తారు.

ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. మరిన్ని వివరాలకు – పరవస్తు నాగసాయి సూరి, గుంటూరు – కృష్ణా జిల్లాల క్షేత్ర ప్రచార అధికారి – 9949 497 202….. రైతునేస్తం ఫౌండేషన్ – 9705 383 666, 0863 – 2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Details

Date:
November 10
Time:
10:00 am - 4:00 pm
Event Tags:
, , ,
Website:
http://www.rythunestham.com

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా.

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X