సహజ ఆహారం కావాలనే కోరిక
ఇంటి ఆవరణ, డాబాపై ఖాళీ స్థలం
సొంతింటి పంటల సాగుపై ఆసక్తి
మీకుందా.. ?
అయితే మీ కోసమే
సేంద్రియ విధానంలో ఇంటిపంటల పెంపకంపై అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తోంది. గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2019 ఫిబ్రవరి 17న ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్ల పెంపకంపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ మునిరెడ్డి, వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్న గూడెం సీనియర్ సైంటిస్ట్ ఎక్స్ టెన్షన్ అండ్ హెడ్ శ్రీమతి డాక్టర్ కరుణ శ్రీ, హైదరాబాద్ కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి పాల్గొంటారు. సేంద్రియ పద్ధతిలో ఇంటి పంటల పెంపకంపై అవగాహన కల్పిస్తారు.
ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 3 83 666, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించండి.