Spread the love

ఇంటి పంటపై శిక్షణ కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

ఇంటి పంటపై శిక్షణ కార్యక్రమం

April 8, 2018 @ 10:00 am - 5:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2018 ఏప్రిల్ 8వ తేదీ (ఆదివారం) ప్రత్యేకంగా టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకంపై శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హార్టీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్ మునిరెడ్డి, డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్న గూడెం సీనియర్ సైంటిస్ట్ ఎక్స్టెన్షన్ అండ్ హెడ్ శ్రీమతి డా. కరుణశ్రీ, ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి పాల్గొని టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్‌లో సేంద్రియ పద్దతిలో కూరగాయల పెంపకంపై అవగాహన కల్పిస్తారు. కేవలం 4 చదరపు అడుగుల్లో ఒక డ్రమ్ములో 60 మొక్కలు ఏవిధంగా పెంచుకోవచ్చో తెలియజేస్తారు. అలాగే బకెట్లలో కూరగాయల పెంపక విధానాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. శిక్షణలో భాగంగా కషాయాలు, మిశ్రమాల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.
ఈ శిక్షణా కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరేవారు 9705383666, 9676797777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా.

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X