Spread the love

ప్రకృతి సేద్యంలో బొప్పాయి, కూరగాయలు, మునగ సాగుపై రైతు శిక్షణ

Loading Events

« All Events

  • This event has passed.

ప్రకృతి సేద్యంలో బొప్పాయి, కూరగాయలు, మునగ సాగుపై రైతు శిక్షణ

July 14 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

మీరు బొప్పాయి, కూరగాయలు, మునగ రైతులా ? సాగులో అతి తక్కువ పెట్టుబడి పంటలో నాణ్యమైన దిగుబడి అధిక లాభాలు అందించే విధానం కోసం చూస్తున్నారా ? అయితే..

ప్రకృతి వ్యవసాయ విధానమే ఉత్తమ ప్రత్యామ్నాయం

మరి మొదలు పెట్టేది ఎలా ?

ముందుకు సాగేదెలా అనుకుంటున్నారా ?

రండిమీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారం ఏర్పాటు చేస్తోంది.. ప్రకృతి వ్యవసాయ విధానంలో బొప్పాయి, కూరగాయలు, మునగ సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2019 జూలై 14న ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే ఈ పంటలు సాగు చేస్తున్న రైతులు, కొత్తగా ప్రారంభించాలని అనుకుంటున్న వారికి ఈ శిక్షణా కార్యక్రమం సదావకాశం.

ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు పి శరత్ బాబు పాల్గొని, ప్రకృతి వ్యవసాయ విధానంలో బొప్పాయి, కూరగాయలు, మునగ సాగుపై శిక్షణ ఇస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాలను వివరిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.

శిక్షణా కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 3 83 666, 9676 797 777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
Rythu Nestham Foundation, Kornepadu, Vatticherukuru, Guntur, Andhra Pradesh + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X