Spread the love

దానిమ్మ, తైవాన్ జామ, అంజూర సేంద్రియ సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

దానిమ్మ, తైవాన్ జామ, అంజూర సేంద్రియ సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం

July 21 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

దానిమ్మ… తైవాన్ జామ…. అంజూర…. వీటిలో మీరు ఏ పంటనైనా సాగు చేస్తున్నారా ? లేక కొత్తగా సాగు ప్రారంభించాలనుందా ?

అయితే.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారం జూలై 21న ఆదివారం ఏర్పాటు చేస్తోంది…. సేంద్రియ వ్యవసాయ విధానంలో దానిమ్మ, తైవాన్ జామ, అంజూర సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

ప్రకాశం జిల్లా సేంద్రియ వ్యవసాయ రైతు హనుమాన్ కిషోర్, పశ్చిమ గోదావరి జిల్లా రైతు శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సేంద్రియ విధానంలో అతి తక్కువ పెట్టుబడితో దానిమ్మ, తైవాన్ జామ, అంజూర సాగు విధానాలను వివరిస్తారు. జీవన ఎరువుల ఉపయోగాలని తెలియజేస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.

ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 97053 83666, 9676 797 777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

 

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X