Spread the love

కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై రైతు శిక్షణా కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై రైతు శిక్షణా కార్యక్రమం

March 17 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2019 మార్చి 17న ఆదివారం…. ప్రత్యేకంగా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నూతక్కికి చెందిన మహిళా రైతు శ్రీమతి ఉష పాల్గొంటారు. పంచగవ్వ, జీవామృతం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయం, తులసి కలబంధ కషాయం, పచ్చగన్నేరు కలబంధ కషాయం, ఇంగువ ద్రావణం, పుల్లటి మజ్జిగ, శొంఠి కషాయం, మొదలైన వాటి తయారీ, వాడకంపై అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా కొన్ని కషాయాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చేసి చూపిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.

ఈ శిక్షణా కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 383 666, 0863 – 2286255 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
Rythu Nestham Foundation, Kornepadu, Vatticherukuru, Guntur, Andhra Pradesh + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X