Spread the love

సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం

August 4 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

వర్షాభావ పరిస్థితుల్లో రైతుల ముందున్న ఉత్తమ విధానం.. అతి తక్కువ నీటితో సాగే సేద్యం. వీటిలో… చిరుధాన్యాల పంటలే మంచి ప్రత్యామ్నాయం.

మరి చిరుధాన్యాలను సాగు చేయడం ఎలా ? ఏ పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది ?

ఇలా అనేక అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ 2019 ఆగస్టు 4వ తేదీ ఆదివారం ఏర్పాటు చేస్తోంది… సేంద్రీయ వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల పంటల సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం.

గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, ఈ విధానంలో చిరుధాన్యాల పంటలు సాగుపై శిక్షణ ఇస్తారు. అధిక దిగుబడుల సాధనకు సూచనలు ఇస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీని వివరిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.

చిరుధాన్యాల విత్తనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 383 666, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X