Spread the love

చిరుధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

చిరుధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

June 16 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

అతి తక్కువ పెట్టుబడి, స్వల్ప నీటి వినియోగం, కొద్ది రోజుల్లోనే చేతికి వచ్చే పంటలు… చిరుధాన్యాలు. మరి చిరుధాన్యాలను సాగు చేయడం ఎలా ? రైతులే నేరుగా అమ్ముకునే విధానాలేంటి ? బంజరు భూములను సైతం సారవంతం చేసే పద్ధతులేవి ? ఇలా అనేక అంశాలపై రైతున్నలకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ 2019 జూన్ 16న ఆదివారం ఏర్పాటు చేస్తోంది… ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల పంటల సాగు, మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీ, అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతు శిక్షణా కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత, ప్రకృతి – సేంద్రియ వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల పంటలు సాగుపై శిక్షణ ఇస్తారు. అధిక దిగుబడుల సాధనకు సూచనలు ఇస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీని వివరిస్తారు. కార్యక్రమానికి హాజరైన రైతులకు అటవీ చైతన్య ద్రావణం ఉచితంగా పంపిణీ చేస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. చిరుధాన్యాల విత్తనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 3 83 666, 9676 797 777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X