Spread the love

కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై శిక్షణా కార్యక్రమం

Loading Events

« All Events

కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై శిక్షణా కార్యక్రమం

August 18 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

రైతు సంక్షేమానికి… ప్రజా ఆరోగ్యానికి.. ఉత్తమ విధానం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం. జీవామృతం.. బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం.. పంచగవ్య తదితర కషాయాలు, మిశ్రమాలే సహజ సేద్యంలో కీలకం.

ఈ నేపథ్యంలో

ఈ కషాయాలను ఎలా తయారు చేసుకోవాలి ?

పంటకు ఏ సమయంలో ఏ కషాయం వాడాలి ?

తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకురైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారంప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోంది. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2019 ఆగస్టు 18న ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నూతక్కికి చెందిన మహిళా రైతు శ్రీమతి ఉష, గుంటూరు జిల్లా రాజుపాలెం రైతు శివనాగమల్లేశ్వరరావు పాల్గొంటారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చేసి చూపించటంతో పాటు వాటిని వాడే విధానాన్ని తేలియజేస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.

ఈ శిక్షణా కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 383 666, 0863 – 2286255 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
Rythu Nestham Foundation, Kornepadu, Vatticherukuru, Guntur, Andhra Pradesh + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X