Spread the love

సేంద్రియ సాగులో మిరప, పత్తి, వరిసాగుపై రైతు శిక్షణ

Loading Events

« All Events

  • This event has passed.

సేంద్రియ సాగులో మిరప, పత్తి, వరిసాగుపై రైతు శిక్షణ

June 30 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

తొలకరి పలకరించింది… నేల తల్లి పులకరించింది. కానీ.. పొలం బాట పట్టిన రైతన్నలను పెట్టుబడులు కలవరపెడుతున్నాయి ఈ నేపథ్యంలో.. అతి తక్కువ పెట్టుబడితో కూడిన సేంద్రియ వ్యవసాయమే ఉత్తమ ప్రత్యామ్నాయం.

ఈ విధానంలో మిరప, ప్రత్తి, వరి సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఏర్పాటు చేస్తోంది ప్రత్యేక శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2019 జూన్ 30న ఆదివారం జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకండి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీమతి లావణ్యా రమణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సేంద్రియ వ్యవసాయ విధానంలో మిరప, ప్రత్తి, వరి సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తారు. వివిధ రకాల కషాయాలు, మిశ్రమాల తయరీ విధానాన్ని ప్రత్యక్షంగా వివరిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.

ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 97053 83666, 9676 797 777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

 

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X