Spread the love

భూసార పరిరక్షణ, చీడపీడల నివారణపై రైతు శిక్షణా కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

భూసార పరిరక్షణ, చీడపీడల నివారణపై రైతు శిక్షణా కార్యక్రమం

June 2 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

సాగు చేసే నేల బాగుంటేనే పంట బాగా పండుతుంది. రైతుకి ఆదాయం దక్కుతుంది. అందుకే.. ప్రతి రైతు ప్రథమ కర్తవ్యం భూసారాన్ని రక్షించుకోవడం.

ఈ నేపథ్యంలో

మట్టికి పునరుజ్జీవం కల్పించేందుకు పాటించాల్సిన పద్ధతులు

ప్రకృతి వ్యవసాయంలో ఉన్న అవకాశాలు

తెలుసుకునేందుకు … రండి

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2019 జూన్ 2న ఆదివారం జరిగే ప్రకృతి వ్యవసాయంలో భూసార పరిరక్షణ మరియు చీడపీడల నివారణపై రైతు అవగాహన కార్యక్రమానికి హాజరుకండి. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

వ్యవసాయ శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు కె. రామచంద్రం ఈ కార్యక్రమంలో పాల్గొనిప్రకృతి వ్యవసాయంలో భూసార రక్షణకు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తారు. చీడపీడల నివారణపై అవగాహన కల్పిస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీని ప్రత్యక్షంగా వివరిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.

శిక్షణ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 383 666, 9676 797 777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
Rythu Nestham Foundation, Kornepadu, Vatticherukuru, Guntur, Andhra Pradesh + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X