ఆధునిక జీవనశైలిలో సహజ ఆహారం అత్యవసరం
మరి నేడు మనం తీసుకుంటున్న ఆహారంలో ఆ సహజత్వం ఉందా ?
ఈ ప్రశ్నకు అవునని సమాధానం చెప్పలేని పరిస్థితి
ఈ నేపథ్యంలో సహజ ఆహారానికి ఉత్తమ వేదిక ఇంటిపంటలు
నగరాల్లో ఈ నయా సాగు విధానాన్ని మరింత విస్తృతం చేసేందుకు రైతునేస్తం ఫౌండేషన్ విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యానవనశాఖ సహకారంతో అక్టోబర్ 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటి పంటలపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. హైదరాబాద్ జీడిమెట్లలోని సుచిత్ర దగ్గరగల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ సి. పార్థసారధి IAS, తెలంగాణ రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ ఎల్. వెంకట్రాంరెడ్డితో పాటు మిద్దెతోట నిపుణలు, బాల్కనీ గార్డెనింగ్, బకెట్ గార్డెనింగ్, కిచెన్ గార్డెన్ నిపుణులు పాల్గొని తమ అనుభవాలు తెలియజేస్తారు. మిద్దెతోటకు అవసరమైన విత్తనాలు ఉచితంగా ఇవ్వబడును . ఔత్సాహికులు మరియు వర్టికల్ గార్డెనింగ్, హార్టికల్చర్ పంటలపై ఆసక్తి ఉన్న వాళ్ళు పాల్గొనవచ్చు సదస్సులో పాల్గొదలచినవారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు : 83744 49007, 88971 52281, 70939 73999.