Spread the love

వేసవిలో కూరగాయల సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

వేసవిలో కూరగాయల సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం

April 21 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

వేసవిలో కూరగాయల సాగుపై ఆసక్తి ఉందా ? ప్రకృతి, సేంద్రియ సాగు విధానాలు తెలుసుకోవాలా ? ఉద్యానశాఖ అందించే రాయితీ వివరాలు కావాలా ? అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది.. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో కూరగాయల సాగు, ఉద్యానశాఖ అందించే రాయితీ వివరాలపై రైతు శిక్షణ కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2019 ఏప్రిల్ 21న ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా రైతు శివనాగ మల్లేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వేసవిలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో కూరగాయల సాగు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక దిగుబడి, మంచి ఆదాయానికి అనుసరించాల్సిన పద్ధతులను వివరిస్తారు. రైతులకు ఉద్యాన శాఖ అందించే రాయితీలపై అవగాహన కల్పిస్తారు.

ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 383 666, 0863 – 2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X