Spread the love

వ్యవసాయంలో యంత్రపరికరాల వినియోగంపై రైతు అవగాహన కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

వ్యవసాయంలో యంత్రపరికరాల వినియోగంపై రైతు అవగాహన కార్యక్రమం

May 5 @ 10:00 am - 4:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల ఖర్చులు ఆదా సాగు పనిలో నాణ్యత జాదా

మరి ఏ పంటకు ఏ యంత్రం వాడాలి ?

ఏ తోటకు ఏ పరికరం కావాలి ?

ఈ సందేహాలకు సమాధానాలకై రైతునేస్తం ఏర్పాటు చేస్తోంది వ్యవసాయంలో ఉపయోగించే చిన్న యంత్రపరికరాలు, వీడర్లు, పవర్ టిల్లర్, సోలార్ స్ప్రేయర్ల వాడకంపై ప్రత్యక్ష అవగాహన కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో మే 5న ఆదివారం ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో జీవామృతం, కషాయాలు, ద్రావణాల పిచికారీ చేసే విధానం, స్ప్రేయర్లు వాడే విధానం, కొబ్బరి చెట్లు ఎక్కే పరికరం, వీడర్లతో కలుపు నివారణ, నీరు తోడే మెషీన్, కాటన్ పికింగ్ మిషీన్, విత్తనాలు వేసే యంత్రం తదితర పరికరాలపై అవగాహన కల్పిస్తారు.

హైదరాబాద్ కు చెందిన సృజనాత్మక రైతు బొమ్మగాని మల్లేశం, పెదనందిపాడు రైతు సుభాని, కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణరావు, చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన వినూత్న పరికరాల సృష్టికర్త ప్రకాశ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పరికరాల ఉపయోగాలు, వినియోగించే పద్ధతులపై అవగాహన కల్పిస్తారు.

శిక్షణా కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 9705 383 666, 0863 -2286255 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు

Details

Date:
May 5
Time:
10:00 am - 4:00 pm

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా. + Google Map

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X