Spread the love

వరి, కూరగాయల సాగుపై రైతుశిక్షణా కార్యక్రమం

Loading Events

« All Events

  • This event has passed.

వరి, కూరగాయల సాగుపై రైతుశిక్షణా కార్యక్రమం

September 23, 2018 @ 10:00 am - 5:00 pm at రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ

ప్రకృతి సేద్యంపై ఆసక్తి ఉందా ?

సహజ సాగు పద్ధతిలో.. వరి, కూరగాయలు పండించే విధానాలు తెలుసుకోవాలా ?

చీడపీడలు, తెగుళ్లను నివారించే పద్ధతులపై సందేహాలున్నాయా…?

అయితే రండి… మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది.. ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, కూరగాయల సాగుపై రైతుశిక్షణా కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2018 సెప్టెంబర్ 23న ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీమతి లావణ్య రమణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖాధికారి రాజా కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని… రైతులకు శిక్షణ ఇస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాలను వివరిస్తారు. ఉద్యానవనశాఖ అందించే రాయితీ వివరాలను తెలియజేస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఉచితంగా వేస్ట్ డీ కంపోజర్ పంపిణీ చేయబడుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 83675 35439, 97053 83666, 96767 97777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Details

Date:
September 23, 2018
Time:
10:00 am - 5:00 pm
Event Tags:
, , ,
Website:
http://www.rythunestham.com

Venue

రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణ
కొర్నెపాడు, వట్టి చెరుకూరు మం||, గుంటూరు జిల్లా.

Organiser

Yadlapalli Venkateshwara Rao

Event Navigation

X