Spread the love

ప్రగతి రిసార్ట్స్‌ రజతోత్సవాల్లో భాగంగా అక్టోబరు 28 ఆదివారం ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే అంశంపై ప్రత్యేక సదస్సును నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటలనుంచి నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని శిల్పారామం సంప్రదాయ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డబ్ల్యూ.ఆర్‌.రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ప్రగతి రిసార్ట్స్ అధినేత జీబీకే రావు, ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సిరిధాన్యాలు, కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యంపై ఖాదర్ వలి అవగాహన కల్పిస్తారు. అనంతరం… ప్రగతి రిసార్ట్స్ మరియు రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శిల్పరామం సంప్రదాయ వేదికలో దేశీయ ఆహారం, ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలనపై సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌వలి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. మరిన్ని వివరాలకు 96767 97777, 70939 73999 నెంబర్లను సంప్రదించగలరు.