Spread the love

పాలు, కాఫీ, టీ లతో ముప్పేంటి ?

బియ్యం, గోధుమలు, చెక్కెర ఎందుకు వద్దు ?

ఈ పదార్థాలతో దేహానికి జరుగుతున్న నష్టమేంటి ?

షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్

తదితర రోగాలు ఎందుకు వస్తున్నాయి

రాకుండా నియంత్రించడం ఎలా ?

ఆహార, ఆరోగ్య విషయంలో ఇలాంటి అనేక అంశాలపై పూర్తి అవగాహన కోసం చూస్తున్నారా ? అయితేరండి.. స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి గారిచే సెప్టెంబర్ 3 మంగళవారం సికింద్రాబాద్ లోని హరిహర కళా భవన్ లో రైతునేస్తం ఫౌండేషన్ నిర్వహిస్తోన్న సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమానికి హాజరుకండి.

సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆధునిక ఆహార అలవాట్లతో ఆరోగ్యానికి జరుగుతున్న నష్టం.. సిరిధాన్యాలు, కషాయాలతో రోగాల నియంత్రణ, నిర్మూలనపై డాక్టర్ ఖాదర్ వలి అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య సమస్యలపై ప్రజల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. అధిక సమయం కేటాయించి పూర్తి చికిత్సా విధానాలు వివరిస్తారు.

కార్యక్రమం జరిగే తేదీ, సమయం, ప్రాంతం వివరాలు మరోసారి ….

సెప్టెంబర్ 3 (మంగళవారం ) – సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు

వేదిక – హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ దగ్గర, సికింద్రాబాద్, హైదరాబాద్.

మెట్రో ద్వారా వచ్చే వారు హైటెక్ సిటీ నాగోల్ మార్గంలో పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి.. వేదిక వద్దకు చేరుకోవచ్చు.

కార్యక్రమానికి అందరు ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. వేదిక వద్ద సిరిధాన్యాలైన అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, ఆరికెలు…. వ్యవసాయ – అనుబంధ రంగాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు 9676 797 777, 7093 973 999 నెంబర్లలో సంప్రదించగలరు.