Spread the love

జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం, వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్‌)ల ఆధ్వర్యంలో సేంద్రియ సేద్యంపై యువతకు శిక్షణ కార్యక్రమం జరగనుంది.

మార్చి 7 నుంచి ఏప్రిల్‌ 5 వరకు హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో వున్న మేనేజ్‌ ప్రాంగణంలో రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహిస్తారు.

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ శిక్షణ పొందేందుకు అర్హులు. శిక్షణ, భోజనం, వసతి, ఉచితం.

వివరాలకు కోర్సు సమన్వయకర్త డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను 92478 09764 నెంబర్‌లో వాట్సాప్‌ ద్వారా సంప్రదించవచ్చు.