Spread the love

రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలతో

వ్యవసాయం

పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి

హానికరం

సహజ సిద్ధంగా, సేంద్రియ విధానంలో సాగుతో

పర్యావరణం పదిలం

ప్రజల ఆరోగ్యం క్షేమం

ఈ నేపథ్యంలో.. సేంద్రియ రైతులకు చేయూత, సేంద్రియ ఆహార ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకుహైదరాబాద్ లోని హైటెక్ సిటీ వద్ద గల శిల్పారామం నైట్ బజార్ లో 2019 మార్చి 1, 2, 3 తేదీల్లో సేంద్రియ ఉత్పత్తుల మేళాజరగనుంది. గో ఆధారిత రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో…. గ్రామ భారతి, రైతునేస్తం, ఏకలవ్వ ఫౌండేషన్, భారతీయ కిసాన్ సంఘ్ వారి సహకారంతో సేంద్రియ ఉత్పత్తుల మేళా నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు, అవగాహన సమ్మేళనాలు జరుగుతాయి.

తేదీల వారీగా జరిగే కార్యక్రమాలు వివరాలు….

మార్చి 1న ఉదయం 10 గంటలకు మహారైతు సమ్మేళనం, సేంద్రియ వ్యవసాయంపై ఇష్టాగోష్ఠి, రైతులతో భోజనం

మార్చి 2న సాయంత్రం 3 గంటలకు సేంద్రియ వ్యవసాయంపై సదస్సు

మార్చి 3న సాయంత్రం 3 గంటలకు సేంద్రియ వ్యవసాయంపై సదస్సు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు

స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, ఆధునిక రోగాల నియంత్రణ నిర్మూలన, సిరిధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, వినియోగంపై ఖాదర్ వలి అవగాహన కల్పిస్తారు.

సేంద్రియ ఉత్పత్తుల మేళాలో రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి స్థలం కేటాయిస్తారు. వ్యాపారస్తులు స్టాల్స్ కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు – 7659 855 588 , 9100 102 229

ప్రజల ఆరోగ్యం, రైతు అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా నిర్వహిస్తోన్న సేంద్రియ ఉత్పత్తుల మేళాకి అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.