Spread the love

రైతునేస్తం 14వ వార్షికోత్సం సందర్భంగా సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఐ.వి. సుబ్బారావు పేరిట… వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అగ్రికల్చర్ జర్నలిస్టులతో పాటు విస్తరణ అధికారులను అవార్డులతో ఘనంగా సత్కరించనుంది.

వ్యవసాయ మరియు అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, రైతులు, వ్యవసాయ జర్నలిస్టులు వారి బయోడేటాతో పాటు పరిశోధనా వ్యాసాలు, సాగు అనుభవాలను 2018 సెప్టెంబర్ 20వ తేదీలోగా పంపాల్సిందిగా కోరుతున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలవారు దరఖాస్తులు పంపవచ్చు.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా
ఎడిటర్, రైతునేస్తం, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ – 500004, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు – 040- 2339 5979, 9676 797 777.

మరో చిరునామా…
రైతునేస్తం, డోర్ నెంబర్ 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్ట్, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522017. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ – 9849312629.

ఈ వార్షికోత్సవం అక్టోబర్ లో ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.