Spread the love

రైతు నేస్తం కీర్తి కిరీటంలో పద్మశ్రీ చేరింది. పదిహేనేళ్లుగా కర్షకులకు సేంద్రీయ సాగులో విలువైన సలహాలిస్తూ చేదోడు వాదోడుగా నిలిచిన…. యడ్లపల్లి వెంకటేశ్వరరావు సేవను గుర్తించిన భారత ప్రభుత్వందేశంలో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందించింది. పార్లమెంటు హాల్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా యడ్లపల్లి వెంకటేశ్వరరావు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్నెపాడులో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన యడ్లపల్లి వెంకటేశ్వరరావు…. డీటీపీ ఆపరేటర్ గా కెరీర్ ప్రారంభించికంప్యూటర్ డిజైనింగ్, ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు. ప్రింటింగ్ రంగంలో రాణిస్తూనేవ్యవసాయం చేస్తున్న రైతులకు సాయం చేయాలన్న సంకల్పంతో 2005లో రైతునేస్తం మాస పత్రికను ప్రారంభించారు. అంచలంచెలుగా ఎదుగుతూతదుపరి పశునేస్తం, ప్రకృతినేస్తం మంత్లీ మ్యాగజైన్స్ ను అందుబాటులోకి తెచ్చి వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ పత్రికలు కేవలం శాస్త్రవేత్తల అభిప్రాయాలకే ప్రాధాన్యమిస్తున్న కాలంలో…. రైతుల అనుమానాలను నివృత్తి చేస్తూ.. వారికి సలహా ఇచ్చే అసలైన నేస్తంలారైతునేస్తం పేరుగాంచింది. దీంతో పత్రిక పేరే ఇంటిపేరుగా మారిపోయి రైతునేస్తం వెంకటేశ్వరరావుగా తెలుగురాష్ట్రాల్లో కీర్తిగడించారు.ఆయన 15ఏళ్లుగా ప్రకృతి, సేంద్రీయ సేద్యం విస్తృతికి విశేష సేవలందిస్తున్నారు. ప్రకృతి సేద్యంలో మెలకువలు నేర్పిస్తూఖర్చులు తగ్గించి ఆదాయం పెంచేలా వ్యవసాయ విధానంలో సూచనలు ఇస్తున్నారు. రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల చేత శిక్షణ అందిస్తున్నారు. ప్రతి ఆదివారం గుంటూరు కొర్నెపాడులోరసాయన రహిత సేద్యం, మిద్దెతోట, చిరుధాన్యాల సాగు, సేంద్రీయ ఉత్పత్తులపై శిక్షణ తరగతులు, రెండు రాష్ట్రాలలో అనేక వ్యవసాయ సదస్సులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలు, అధికారులు, ఉద్యోగులు, పాత్రికేయులకు పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరుతో రైతునేస్తం అవార్డుల్ని అందిస్తున్నారు. వెబ్ సైట్, యూట్యూబ్, మొబైల్ యాప్ ద్వారా రైతు విజయాలు, సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తుంటారు. నగరాల్లో నయా సాగు విధానమైన ఇంటి పంటలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మిద్దెతోటల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇంటి పంటలపై ప్రముఖుల ద్వారా ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తారు. రసాయనిక ఎరువుల వినియోగానికి స్వస్తి పలికి సేంద్రియ పద్దతుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల దిగుబడికి వెంకటేశ్వరరావు చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.