Spread the love

పోషక విలువలులేని ఆహార పదార్థాలతో మనుషుల్లో వ్యాధినిరోధక శక్తి నశిస్తోందని చిరుధాన్యాల నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌వలి స్పష్టం చేశారు. మాంసం, పాలు, బియ్యం, గోధుమలను ఆహారంగా తీసుకోవడంవల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యకు సిరిధాన్యాలు, కషాయాలే పరిష్కారమని వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లకడీకపూల్‌లోని రెడ్‌హిల్స్‌ కాలనీలోని ఫాప్సీ భవన్‌లో సిరిధాన్యాలపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిరుధాన్యాల నిపుణులు ఎం.సి.వి. ప్రసాద్, సాక్షి సాగుబడి డెస్క్‌ ఎడిటర్‌ పంతంగి రాంబాబు, ప్రగతి రిసార్ట్స్‌ అధినేత జి.బి.కే. రావు, రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వై. వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోషక విలువలులేని ఆహార పదార్థాలతో మనుషుల్లో వ్యాధినిరోధక శక్తి నశిస్తోందని చిరుధాన్యాల నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌వలి స్పష్టం చేశారు. మాంసం, పాలు, బియ్యం, గోధుమలను ఆహారంగా తీసుకోవడంవల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యకు సిరిధాన్యాలు, కషాయాలే పరిష్కారమని వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లకడీకపూల్‌లోని రెడ్‌హిల్స్‌ కాలనీలోని ఫాప్సీ భవన్‌లో సిరిధాన్యాలపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిరుధాన్యాల నిపుణులు ఎం.సి.వి. ప్రసాద్, సాక్షి సాగుబడి డెస్క్‌ ఎడిటర్‌ పంతంగి రాంబాబు, ప్రగతి రిసార్ట్స్‌ అధినేత జి.బి.కే. రావు, రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వై. వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐదు సిరిధాన్యాలు పంచరత్నాలు

స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ వలి

కొర్రలు, అండుకొర్రలు, అరికలు, సామలు, ఊదలను ఆహారంగా తీసుకుంటే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందని ఖాదర్‌ వలి పేర్కొన్నారు. వాణిజ్య ప్రయోజనాల కోసం పాశ్చాత్య దేశాలు రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయని విమర్శించారు. పాలు, టీ, కాఫీ మానేయాలని సూచించారు. ఆధునిక ఆహారపు అలావట్లు మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, క్యాన్సర్‌ వంటి వ్యాధులకు కారణమవుతున్నాయని తెలిపారు. మన పూర్వీకుల ఆహారమైన సిరిధాన్యాలు, కషాయాలను ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని స్పష్టం చేశారు.

ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తాం: రైతునేస్తం 

సిరిధాన్యాలను ప్రతి ఒక్కరూ ఆహారంగా తీసుకోవాలని రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వర రావు అభిప్రాయపడ్డారు. చిరుధాన్యాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కృషిచేస్తామని తెలిపారు. రైతునేస్తం పబ్లికేషన్స్‌ ప్రచురించిన ” సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం” పుస్తకాన్ని ఖాదర్‌ వలి ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైనవారికి ఈ పుస్తకాన్ని ఉచితంగా అందజేశారు. అనంతరం ఖాదర్‌ వలి సహా కార్యక్రమానికి హాజరైన అతిథులను వెంకటేశ్వరరావు సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌, బుద్ధిమాంద్యం క్యాన్సర్‌ తదితర అనారోగ్య సమస్యలపై ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఖాదర్‌ వలి సమాధానాలిచ్చారు. చిరుధాన్యాలు, కషాయాలతో వ్యాధులను నియంత్రించే పద్ధతులను వివరించారు.