రైతునేస్తం

01 Sep

మిరప, వరి సాగు | కషాయాలు, మిశ్రమాల పై శిక్షణా కార్యక్రమం

వరి, మిరప సాగులో తక్కువ పెట్టుబడి, నాణ్యమైన దిగుబడి, మార్కెట్లో అధిక రాబడి కి ప్రకృతి, సేంద్రియ వ్యవసాయమే ఉత్తమ విధానం. మరి ఈ పద్ధతిలో సాగేదెలా ? ఉపయోగించే కషాయాలు, మిశ్రమాలేవి ? తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు .. రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఈ...

25 Aug

బత్తాయి, మునగ,నిమ్మ సాగుపై శిక్షణా కార్యక్రమం

బత్తాయి !  మునగ ! నిమ్మ ! వీటిలో ఏవైనా పంటలు  మీరు సాగు చేస్తున్నారా ? అయితే... మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 25న ఆదివారం ఏర్పాటు చేస్తోందిప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో బత్తాయి, మునగ

04 Aug

సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం

వర్షాభావ పరిస్థితుల్లో రైతుల ముందున్న ఉత్తమ విధానం.. అతి తక్కువ నీటితో సాగే సేద్యం. వీటిలో… చిరుధాన్యాల పంటలే మంచి ప్రత్యామ్నాయం. మరి చిరుధాన్యాలను సాగు చేయడం ఎలా ? ఏ పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది ? ఇలా అనేక అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ 2019 ఆగస్టు 4వ తేదీ ఆదివారం ఏర్పాటు చేస్తోంది… సేంద్రీయ వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల పంటల సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, ఈ విధానంలో చిరుధాన్యాల పంటలు...

21 Jul

దానిమ్మ, తైవాన్ జామ, అంజూర సేంద్రియ సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం

దానిమ్మ… తైవాన్ జామ…. అంజూర…. వీటిలో మీరు ఏ పంటనైనా సాగు చేస్తున్నారా ? లేక కొత్తగా సాగు ప్రారంభించాలనుందా ? అయితే.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారం జూలై 21న ఆదివారం ఏర్పాటు చేస్తోంది…. సేంద్రియ వ్యవసాయ విధానంలో దానిమ్మ

08 Jul

ఏపీ రైతు దినోత్సవం – జూలై 8 – వైఎస్ఆర్ రైతునేస్తం అవార్దుల ప్రదానోత్సవం

అన్నదాతల ఆప్తుడు, వ్యవసాయంలో విప్లవాత్మక పథకాలకు ఆద్యుడు, దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి. జూలై 8న ఆ మహానేత జయంతి. ఈ నేపథ్యంలోరైతు బాంధవుడు రాజన్న జయంతిని పురస్కరించుకొని ఆ రోజుని రైతు దినోత్సవంగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ...

16 Jun

చిరుధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

అతి తక్కువ పెట్టుబడి, స్వల్ప నీటి వినియోగం, కొద్ది రోజుల్లోనే చేతికి వచ్చే పంటలు… చిరుధాన్యాలు. మరి చిరుధాన్యాలను సాగు చేయడం ఎలా ? రైతులే నేరుగా అమ్ముకునే విధానాలేంటి ? బంజరు భూములను సైతం సారవంతం చేసే పద్ధతులేవి ? ఇలా అనేక అంశాలపై రైతున్నలకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ 2019 జూన్ 16న ఆదివారం ఏర్పాటు చేస్తోంది… ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల పంటల సాగు, మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీ, అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతు శిక్షణా కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్...

09 Dec

గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరులో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు

అనారోగ్య సమస్యలతో బాధలా? బాగు చేసే మార్గం కోసం చూస్తున్నారా ? ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కోసం వెతుకుతున్నారా ? అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి గారిచే సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరు నగరాల్లో ఈ కార్యక్రమాల్లో కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని సిరిధాన్యాలు, కషాయాలతో షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తదితర రోగాల నిర్మూలన, నియంత్రణపై అవగాహన కల్పిస్తారు….. కార్యక్రమాల తేదీలు, వేదికలు…. ☛ గూడూరులో… డిసెంబర్ 9 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వేదిక : దవ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాల్, ఐ.సి.ఎస్. రోడ్, గూడూరు

11 Oct

అక్టోబర్ 13న మిద్దెతోటపై హైదరాబాద్ లో అవగాహన సదస్సు

కాంక్రీట్ జంగిల్ వంటి నగరాల్లోను స్వచ్ఛమైన ఆహారం, ఆహ్లాదకరమైన వాతావరణం మిద్దెతోటలతో సాధ్యం అయితే.. ఇంటి పంటల సాగు ఎలా ? ఎలా ప్రారంభించాలి ? ఏమేం కావాలి

24 Aug

సేంద్రియ ఉత్పత్తులకు స్కోప్ సర్టిఫికెట్

రైతునేస్తం: సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. రసాయన ఎరువులతో పండించిన ఆహారం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందన్న ఆవేదన ఇటీవల కాలంలో ప్రజల్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో సహజ పద్ధతుల్లో పండించిన పంట ఉత్పత్తుల వైపు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే.. సేంద్రియ సేద్యం చేస్తున్న రైతులు ప్రస్తుతం తక్కువగా ఉండటం.. కావాల్సినంత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో లేకపోవటంతో డిమాండ్ పెరుగుతోంది. ఇదే అదునుగా కొంత మంది రసాయనాలు, పురుగుమందులతో పండించిన వాటిని కూడా సేంద్రియ బ్రాండ్ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ.. సేంద్రియ ధ్రువీకరణను ఇటీవల ప్రారంభించింది. ఈ మేరకు అపెడా నుంచి అనుమతి పొందిన సంస్థ.....

03 Aug

తెలంగాణ ప్యాక్స్ పాలకవర్గాల పదవీకాలం 6 నెలల పొడగింపు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్‌) పాలకవర్గాల పదవీకాలం మరో ఆరునెలలు పొడిగిస్తూ తెలంగాణ సహకార శాఖ ఆగస్టు 2న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వారినే పర్సన్‌ ఇన్‌ఛార్జిలుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2018 ఫిబ్రవరి ఒకటిన పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆరునెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ గడువు కూడా జూలై నెలాఖరుతో ముగిసింది. ఈలోగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి సహకార శాఖకు ఆదేశాలేమీ రాలేదు. ఎన్నికలు నిర్వహిస్తారా లేక పదవీకాలం పొడిగించాలా అని సహకార రిజిస్ట్రార్‌ గత నెలలో ప్రభుత్వాన్ని అడగ్గా పొడిగించాలనే ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సహకార రిజిస్ట్రార్‌ వీరబ్రహ్మయ్య జిల్లా సహకార అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. వచ్చే ఫిబ్రవరి...

X