agriculture

02 Feb

కేంద్ర బడ్జెట్ లో రైతుకి జై.. ఏడాదికి రూ.6 వేల పెట్టుబడి పథకం

రైతునేస్తం: కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేసింది. తెలంగాణ ప్రభుత్వ బాటలోనే కేంద్రం కూడా రైతుబంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టనుందన్న అంచనాలను నిజం చేస్తూ.. తాజా బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పేరిట సరికొత్త పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 5 ఎకరాల లోపు (2 హెక్టార్లు) సాగు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6 వేల పెట్టుబడి సాయం అందించనుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాలోకి బదిలీ చేస్తామని బడ్జెట్ లో పేర్కొంది. 2018...

02 Aug

సాగుతో “ఉపాధి” అనుసంధానం.. రైతుకి ఆదాయం

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. ఉపాధి హామీని సేద్యానికి అనుసంధానించడంపై అధ్యయనం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులతో జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద పలు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉపయోగపడేలా చేపడుతున్న పనులను వివరిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, నీతి ఆయోగ్‌లు నివేదిక తయారు చేశాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పనుల వివరాలను సైతం ఇందులో ప్రస్తావించారు. వివరాలివీ… – రైతులకు ఉపయోగపడే గోదాములు, పొలాల్లో నీటిగుంతలు, అడ్డుకట్టలు వంటి మౌలిక సదుపాయాల వృద్ధి పనులు చాలా అవసరం. వ్యవసాయమే కాకుండా దాని అనుబంధ రంగాలకు...

14 Jul

పత్తి రైతుల్లో గుబులు పుట్టిస్తున్న ‘గులాబీ’ పురుగు

రైతునేస్తం : గులాబీ రంగు పురుగు. ప్రస్తుతం ఇది రాష్ట్రంలో పత్తి పంట వేసిన రైతులకు దడ పుట్టిస్తోంది. ‘గులాబీ రంగు పురుగు ప్రళయం ముంచుకొస్తోంది’ అని స్వయంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్‌ శాస్త్రవేత్త ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితిని తెలియజేస్తోంది. గులాబీ పురుగు వల్ల పత్తి పంటకు ఈసారి భారీ నష్టం జరగనుందని ఆ శాస్త్రవేత్త ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో గులాబీ రంగు పురుగు కనిపిస్తోందని, వర్షాలతో మున్ముందు దాని విస్తరణ మరింత వేగం కానుందని ఆ శాస్త్రవేత్త హెచ్చరించారు. సాధారణంగా కాయ దశలో కనిపించాల్సిన ఆ పురుగు.. మొక్క దశలోనే దాడి చేయడంపై అన్నదాతల ఆందోళన...

02 Jul

ధాన్యం కనీస మద్దతు ధరపై రూ.200 పెంపు!

రైతుల పెట్టుబడికి ఒకటిన్నరెట్లు అధికంగా కనీస మద్దతు ధర చెల్లిస్తామని ఇటీవల ప్రకటించిన కేంద్రం ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. అందులో భాగంగా ధాన్యం కనీస మద్దతు ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత ఖరీఫ్‌ కాలంలో క్వింటాలు ధాన్యం ధరను రూ.1,750కు పెంచుతూ ప్రకటన వెలువరించనుంది. అంటే సాధారణ రకం ధాన్యంపై రూ.200 మేర పెరగనుంది. ప్రస్తుతం సాధారణ రకం ధాన్యం క్వింటాలు ధర రూ.1,550, ఏ గ్రేడు రకం ధర రూ.1,590గా ఉంది. దీంతో పాటుగా మరో 13 ఖరీఫ్‌ పంటల కనీస మద్దతు ధరను కూడా పెంచనుంది. దీనిపై ఈ వారంలోనే నిర్ణయం వెలువడనుంది.రైతుల పెట్టుబడికి ఒకటిన్నరెట్లు అధికంగా కనీస మద్దతు ధర చెల్లిస్తామని ఇటీవల...

13 Jun

వ్యవసాయ యంత్ర పరికరాలు – రైతునేస్తాలు

సాంకేతిక విప్లవం.. అన్ని రంగాల్లో భారీ  మార్పులు తీసుకొచ్చింది. సేద్యం ఇందుకు మినహాయింపేం కాదు. గతంలో స్వేదమే ప్రధాన పెట్టుబడిగా ఉన్న వ్యవసాయంలో… నేడు ఎన్నో ఆధునిక పద్ధతులు ఆవిష్కృతం అయ్యాయి. రైతు శ్రమని, కూలీల ఖర్చుని తగ్గించి.. అధిక దిగుబడులు ఇచ్చే అనేక ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. విత్తనం వేసింది మొదలు.. పంటలు కోసే వరకు ఉపయోగించే వివిధ రకాల వ్యవసాయ యంత్రాలను అనేక మంది ఔత్సాహిక శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాత అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఆధునిక సాగు పరికరాలపై రైతులకు అవగాహన పెంచేందుకు “రైతునేస్తం ఫౌండేషన్” జూన్ 10న వ్యవసాయ యంత్ర పరికారల ప్రదర్శన నిర్వహించింది. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో...

X