andhra pradesh

21 Jul

దానిమ్మ, తైవాన్ జామ, అంజూర సేంద్రియ సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం

దానిమ్మ… తైవాన్ జామ…. అంజూర…. వీటిలో మీరు ఏ పంటనైనా సాగు చేస్తున్నారా ? లేక కొత్తగా సాగు ప్రారంభించాలనుందా ? అయితే.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారం జూలై 21న ఆదివారం ఏర్పాటు చేస్తోంది…. సేంద్రియ వ్యవసాయ విధానంలో దానిమ్మ

14 Jul

ప్రకృతి సేద్యంలో బొప్పాయి, కూరగాయలు, మునగ సాగుపై రైతు శిక్షణ

మీరు బొప్పాయి, కూరగాయలు, మునగ రైతులా ? సాగులో అతి తక్కువ పెట్టుబడి పంటలో నాణ్యమైన దిగుబడి అధిక లాభాలు అందించే విధానం కోసం చూస్తున్నారా ? అయితే.. ప్రకృతి వ్యవసాయ విధానమే ఉత్తమ ప్రత్యామ్నాయం మరి మొదలు పెట్టేది ఎలా ? ముందుకు సాగేదెలా అనుకుంటున్నారా ? రండిమీ...

30 Jun

సేంద్రియ సాగులో మిరప, పత్తి, వరిసాగుపై రైతు శిక్షణ

తొలకరి పలకరించింది… నేల తల్లి పులకరించింది. కానీ.. పొలం బాట పట్టిన రైతన్నలను పెట్టుబడులు కలవరపెడుతున్నాయి ఈ నేపథ్యంలో.. అతి తక్కువ పెట్టుబడితో కూడిన సేంద్రియ వ్యవసాయమే ఉత్తమ ప్రత్యామ్నాయం. ఈ విధానంలో మిరప, ప్రత్తి, వరి సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఏర్పాటు చేస్తోంది ప్రత్యేక శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా

09 Aug

ఆంధ్రప్రదేశ్‌లో కరువు మండలాల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం రాత్రి కరువు మండలాలను ప్రకటించింది. ఆరు జిల్లాల్లోని 274 మండలాలు తీవ్రంగా, ఒక మండలం ఓ మోస్తరుగా కరువు బారిన పడినట్టు పేర్కొంటూ రెవెన్యూ శాఖ గెజిట్ విడుదల చేసింది. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావానికి గురైన ప్రాంతాల ఆధారంగా కరువు మండలాలను గుర్తించారు. సీజన్ ప్రారంభంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఉన్న మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలనేది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకం. దాని ప్రకారం ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ జాబితాను విడుదల చేశారు. ఆరు జిల్లాల్లో జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం 245.0మి.మీ.కు 214.8మి.మీ (302% తక్కువ)నమోదైంది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల...

07 Jul

ఏపీలో జూలై 7-14 వరకు పశుగ్రాస వారోత్సవాలు

రైతునేస్తం: రాష్ట్రవ్యాప్తంగా జూలై 7 నుంచి 14 వరకు పశుగ్రాస వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలను అన్ని మండలాల్లోని పశువైద్యశాలల్లో జరుపుతున్నారు. ఇందులో పశుగ్రాస పెంపకం, పాల ఉత్పత్తి, మేలు జాతి పశుగ్రాసాల విత్తనాలు, గడ్డి కత్తిరించే యంత్రాలపై అవగాహన కల్పిస్తారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పశుగ్రాసం సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు రాయితీపై పశుగ్రాస విత్తనాలు సరఫరా చేస్తారు. ఒక్క రూపాయికే కిలో పచ్చిమేత, రూ.2కు కిలో సైలేజిని, రూ.3లకే కిలో ఎండుమేత, రూ.3.50లకు కిలో సంపూర్ణ దాణా మిశ్రమం, రూ.4లకే కిలో దాణా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు పశుసంవర్థకశాఖ సంచాలకులు సోమశేఖరం తెలిపారు. ...

29 Jun

“చంద్రన్న రైతు బీమా” ప్రారంభం

వ్యవసాయానికి శుభారంభం పలికే ఏరువాక పున్నమి రోజున రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. రైతన్నల కుటుంబాల్లో భరోసా నింపేలా, వారికి ధీమా కల్పించేలా “చంద్రన్న రైతు బీమా” పథకాన్ని ప్రకటించారు. జూన్ 28న (గురువారం) శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఏరువాక పున్నమి వేడుక ప్రారంభోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు.. ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులందరికీ ఇప్పటికే చంద్రన్న బీమా అమలవుతోంది. ఇప్పుడు రైతులను ఈ దీని పరిధిలోకి తెస్తూ చంద్రన్న రైతు బీమా పథకాన్ని రూపొందించారు. ఇది ఈ నెల(జూన్) నుంచే అమలవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రీమియం కింద రూ.18.70 కోట్ల చెక్కును ఈ సందర్భంగా బీమా సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి అందచేశారు. ఈ...

18 Jun

రొయ్యలసాగు రైతులకు స్మార్ట్‌ కార్డులు

రొయ్యల సాగు రైతులను ప్రోత్సహించే దిశగా కీలక ముందుడగు పడింది. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యలు సాగుచేస్తున్నా ఏ ప్రాంతంలో ఎంత సాగు అవుతుంది? ఏ రైతు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడు అనే విషయాలపై ప్రభుత్వం వద్ద కచ్చితమైన గణాంకాలు లేవు. గతేడాది నుంచి అమెరికా, యూరోపియన్‌ దేశాలు మన రొయ్యల దిగుమతిపై నిబంధనలు కఠినతరం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల సాగుపై ఎనిమిది నెలల కిందట శాటిలైట్‌ సర్వే ప్రారంభించాయి. అందులో భాగంగా ప్రస్తుతం రొయ్యల సాగు రైతులకు స్మార్ట్‌ కార్డులు జారీచేస్తున్నాయి.  రొయ్యల సాగు రైతులను ప్రోత్సహించే దిశగా కీలక ముందుడగు పడింది. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యలు సాగుచేస్తున్నా ఏ ప్రాంతంలో...

30 May

నైరుతి ఆగమనం

అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు మంగళవారం కేరళను తాకినట్లు భారత వాతావరణశా(ఐఎండీ) తెలిపింది. వచ్చే 48 గంటల్లో ఇవి కేరళలోని మిగతా ప్రాంతాలతోపాటు

X