ap cm

26 Oct

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లల్లో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గిందని వ్యవసాయశాఖ అధికారులు గురువారం కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. రసాయన ఎరువుల వినియోగం 5.21 లక్షల మెట్రిక్‌ టన్నులు తగ్గగా, రైతులకు రూ.943.77 కోట్ల సొమ్ము ఆదా అయ్యిందని, కేంద్ర ప్రభుత్వానికి రూ.815.63 కోట్ల రాయితీ ఆదా అయ్యిందని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డి వివరించారు. పురుగు మందుల వినియోగం 2208.84 మెట్రిక్‌ టన్నులు తగ్గడంతో రూ.1933 కోట్లు రైతులకు ఆదా అయ్యిందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ ఏడాది 96 శాతం పంటను ఈ-క్రాప్‌ కింద నమోదు చేశామని, మిగిలిన 4 శాతాన్ని నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఖరీఫ్‌లో 102 శాతం సూక్ష్మపోషకాలను రైతులకు పంపిణీ చేశామని, రబీలో 1.75...

29 Jun

‘ఏరువాక’ ప్రారంభం

వ్యవసాయ పనులు మొదలు పెట్టడాన్ని వేడుకలా జరిపే ‘ఏరువాక’ పౌర్ణమి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 28న (గురువారం) శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ప్రారంభించారు. సంప్రదాయ దుస్తులైన పంచెకట్టి.. తలపాగా చుట్టి ఎడ్లబండిపై పొలానికి వచ్చారు. రైతన్నలతో కలిసి ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నారు. పొలంలో విత్తనాలు చల్లారు. మహిళలతో కలిసి నారు వేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు.. ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. రైతులకు అన్ని వేళలా ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఏ కష్టమూ రానివ్వకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది అని అన్నారు. ఉపాధి హామిని వ్యవసాయంతో అనుసంధానించాలి : చంద్రబాబు దేశానికి అన్నం పెట్టే రైతన్న సమాజంలో ఆనందంగా...

X