ap farmers

26 Oct

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లల్లో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గిందని వ్యవసాయశాఖ అధికారులు గురువారం కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. రసాయన ఎరువుల వినియోగం 5.21 లక్షల మెట్రిక్‌ టన్నులు తగ్గగా, రైతులకు రూ.943.77 కోట్ల సొమ్ము ఆదా అయ్యిందని, కేంద్ర ప్రభుత్వానికి రూ.815.63 కోట్ల రాయితీ ఆదా అయ్యిందని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డి వివరించారు. పురుగు మందుల వినియోగం 2208.84 మెట్రిక్‌ టన్నులు తగ్గడంతో రూ.1933 కోట్లు రైతులకు ఆదా అయ్యిందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ ఏడాది 96 శాతం పంటను ఈ-క్రాప్‌ కింద నమోదు చేశామని, మిగిలిన 4 శాతాన్ని నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఖరీఫ్‌లో 102 శాతం సూక్ష్మపోషకాలను రైతులకు పంపిణీ చేశామని, రబీలో 1.75...

07 Jul

చంద్రన్న రైతు బీమా నమోదు ప్రారంభం

రైతునేస్తం: ఆంధ్రప్రదేశ్ లో చంద్రన్న రైతు బీమా కార్యక్రమం నమోదు ప్రక్రియ జూలై 7న ప్రారంభమైంది. ఈ మేరకు సర్వే కోసం ‘చంద్రన్న రైతు బీమా’ పేరిట ప్రత్యేక యాప్ ను ప్రభుత్వం రూపొందించింది. రైతుల వివరాల నమోదు బాధ్యతను గ్రామాల్లో సెర్ప్ కు, పట్టణ ప్రాంతాల్లో మెప్మాకు అప్పగించింది. క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో సర్వే చేపట్టేందుకు వీలుగా అధికారులు ఇప్పటికే డ్వాక్రా సభ్యులకు శిక్షణ ఇచ్చారు. గ్రామానికి, వార్డుకి ఇద్దరు చొప్పున డ్వాక్రా సభ్యులు జూలై 15 వరకు సర్వేలో పాల్గొని అర్హులను గుర్తిస్తారు. వారి పేర్లను బీమా పథకంలో నమోదు చేస్తారు. జూన్ 28న ఏరువాక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రకటించారు. రైతులు సహజ...

29 Jun

“చంద్రన్న రైతు బీమా” ప్రారంభం

వ్యవసాయానికి శుభారంభం పలికే ఏరువాక పున్నమి రోజున రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. రైతన్నల కుటుంబాల్లో భరోసా నింపేలా, వారికి ధీమా కల్పించేలా “చంద్రన్న రైతు బీమా” పథకాన్ని ప్రకటించారు. జూన్ 28న (గురువారం) శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఏరువాక పున్నమి వేడుక ప్రారంభోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు.. ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులందరికీ ఇప్పటికే చంద్రన్న బీమా అమలవుతోంది. ఇప్పుడు రైతులను ఈ దీని పరిధిలోకి తెస్తూ చంద్రన్న రైతు బీమా పథకాన్ని రూపొందించారు. ఇది ఈ నెల(జూన్) నుంచే అమలవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రీమియం కింద రూ.18.70 కోట్ల చెక్కును ఈ సందర్భంగా బీమా సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి అందచేశారు. ఈ...

X