apgovt

18 Aug

కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై శిక్షణా కార్యక్రమం

రైతు సంక్షేమానికి… ప్రజా ఆరోగ్యానికి.. ఉత్తమ విధానం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం. జీవామృతం.. బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం.. పంచగవ్య తదితర కషాయాలు, మిశ్రమాలే సహజ సేద్యంలో కీలకం. ఈ నేపథ్యంలో ఈ కషాయాలను ఎలా తయారు చేసుకోవాలి ? పంటకు ఏ సమయంలో ఏ కషాయం వాడాలి ? తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకురైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారంప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ...

26 Oct

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లల్లో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గిందని వ్యవసాయశాఖ అధికారులు గురువారం కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. రసాయన ఎరువుల వినియోగం 5.21 లక్షల మెట్రిక్‌ టన్నులు తగ్గగా, రైతులకు రూ.943.77 కోట్ల సొమ్ము ఆదా అయ్యిందని, కేంద్ర ప్రభుత్వానికి రూ.815.63 కోట్ల రాయితీ ఆదా అయ్యిందని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డి వివరించారు. పురుగు మందుల వినియోగం 2208.84 మెట్రిక్‌ టన్నులు తగ్గడంతో రూ.1933 కోట్లు రైతులకు ఆదా అయ్యిందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ ఏడాది 96 శాతం పంటను ఈ-క్రాప్‌ కింద నమోదు చేశామని, మిగిలిన 4 శాతాన్ని నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఖరీఫ్‌లో 102 శాతం సూక్ష్మపోషకాలను రైతులకు పంపిణీ చేశామని, రబీలో 1.75...

25 Oct

డిసెంబరులోగా ఆంధ్రప్రదేశ్‌ రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల మాఫీ ప్రక్రియను డిసెంబరులోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒక్కో రైతుకు రూ.లక్షన్నర చొప్పున ఐదు విడతలుగా రుణమాఫీ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు 2014లో ప్రకటించారు. ఆ ప్రకారం ఇప్పటి వరకు మూడు విడతల మాఫీ సొమ్మును అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేశారు. మూడు విడతలు మాఫీ వర్తించిన రైతులకు మరో రెండు (నాలుగు, ఐదు) విడతల సొమ్మును విడుదల చేయాల్సి ఉంది. వీరితో పాటు ఇప్పటి వరకు మాఫీ వర్తించని అర్హులను కూడా రైతు సాధికార సంస్థ ద్వారా గుర్తించి.. రుణమాఫీని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వివిధ జిల్లాల్లో వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రైతుసాధికార సంస్థ అధికారులు గ్రీవెన్స్‌లు...

27 Sep

ఆంధ్రప్రదేశ్‌లో పత్తి కొనుగోళ్లకు సీసీఐ ఏర్పాట్లు

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో పత్తి కొనుగోళ్లపై సిసిఐ అధికారులు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సమ్మర్‌ కాటన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. నవంబర్‌లో కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర మార్కెటింగ్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సిసిఐ ఏపీ ప్రతినిధులు, ముంబైలోని ఆ సంస్థ ఉన్నతాధికారులు ఇప్పటికే రెండుసార్లు భేటీ అయ్యారు. ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 6 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయగా సుమారు 20 లక్షల బేళ్లు పండుతుందని అంచనా. కొనుగోళ్ల ముందు అవగాహన సదస్సులు రాష్ట్రంలోని నోటిఫై చేసిన 43 కొనుగోలు కేంద్రాల పరిధిలో మార్కెటింగ్‌ శాఖ ద్వారా సిసిఐ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు రైతులకు అవగాహన సదస్సులు...

26 Sep

ఆంధ్రప్రదేశ్‌లో రబీ రైతులకు రాయితీ విత్తనాలు

ఈ ఏడాది రబీ సీజన్‌లో సాగు చేసేందుకు రైతులకు నూరుశాతం రాయితీపై విత్తనాలు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు 3.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా శనగలు 3,03,080 క్వింటాళ్లు, వేరుశనగ 27,420 క్వింటాళ్లు, వరి 19,748 క్వింటాళ్లు, మొక్కజొన్న 12,920 క్వింటాళ్లు ఉన్నాయి. కంది 140, పెసర 1100, మినుము 2310, పిల్లిపెసర 200, జొన్న 252, రాగులు 405, నువ్వులు 565, ఆవు బఠానీ 1510, ఉలవలు 340, సన్‌ఫ్లవర్‌ 150, ఆముదం 40, సజ్జ 30 క్వింటాళ్లు అందించాలని విత్తనాభివృద్ధి సంస్థలకు వ్యవసాయశాఖ అధికారులు లేఖ రాశారు. ...

07 Sep

ఏపీలో ఉద్యాన పంటల విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక

ఉద్యాన పంటల విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతున్నామని ఏపీ ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి వెల్లడించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లోని క్యాపిటల్‌ హోటల్‌లో కోల్డ్‌ చైన్‌ యాజమాన్య పద్ధతులపై కార్యశాల జరిగింది. చిరంజీవి చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో 42 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారని, గత రెండు, మూడు సంవత్సరాల్లో ఉద్యాన పంటల సాగును విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఉద్యాన పంటలకు తక్కువ వ్యయంతో అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రోత్సహాకాలు అందజేస్తున్నారని వివరించారు. కూరగాయలు, పండ్లు పంటల సాగుతో రెట్టింపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముందుకు సాగాలని...

17 Aug

ఆంధ్రప్రదేశ్‌లో ఊపందుకున్న వరిసాగు

ఏపీలో వరి సాగు అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పటికే సాధారణ విస్తీర్ణంలో 64 శాతం వరినాట్లు పడ్డాయి. రాష్ట్రంలో వరి విస్తీర్ణం 15.50లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 9.99లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. గతేడాది ఇదే సమయానికి 8.78లక్షల హెక్టార్లలోనే వరి నాట్లు వేశారు. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న జిల్లాల్లో వరి సాగు జోరుగా సాగుతోంది. వరి కోతకొచ్చే సమయంలో తుఫాన్ల వలన పంట నాశనం కాకుండా ముందస్తు సాగు కోసం ప్రభుత్వం గోదావరి, కృష్ణా డెల్టాలకు జూన్‌ నెలలోనే సాగునీటిని విడుదల చేసింది. వంశధార, నాగావళి ప్రాజెక్టుల నీటినీ సకాలంలో అందించింది. దీంతో శ్రీకాకుళం, ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల రైతులు నైరుతి ప్రవేశించిన తొలినాళ్లలోనే నారు పోశారు. జూలై రెండోవారం...

09 Aug

ఆంధ్రప్రదేశ్‌లో కరువు మండలాల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం రాత్రి కరువు మండలాలను ప్రకటించింది. ఆరు జిల్లాల్లోని 274 మండలాలు తీవ్రంగా, ఒక మండలం ఓ మోస్తరుగా కరువు బారిన పడినట్టు పేర్కొంటూ రెవెన్యూ శాఖ గెజిట్ విడుదల చేసింది. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావానికి గురైన ప్రాంతాల ఆధారంగా కరువు మండలాలను గుర్తించారు. సీజన్ ప్రారంభంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఉన్న మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలనేది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకం. దాని ప్రకారం ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ జాబితాను విడుదల చేశారు. ఆరు జిల్లాల్లో జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం 245.0మి.మీ.కు 214.8మి.మీ (302% తక్కువ)నమోదైంది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల...

07 Aug

ఏపీలో తోతాపురి ప్రాసెసింగ్ యూనిట్లకు రాయితీ సొమ్ము

రైతుల నుంచి తోతాపురి మామిడిని కిలో రూ.7.50 చొప్పున కొనుగోలు చేసిన ప్రాసెసింగ్ యూనిట్లకు ఏపీ ప్రభుత్వం రూ.2.50 చొప్పున రాయితీ సొమ్ము చెల్లించనుంది. అధీకృత అధికారులు ధ్రువీ కరించిన తర్వాత రాయితీ చెల్లించాలని సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. జూలై 31 వరకు కొనుగోలు చేసినవాటికి రాయితీ సొమ్ము చెల్లించనున్నారు. మొత్తం లక్షా పది వేల టన్నులను ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ...

07 Aug

ఏపీలో 11జిల్లాలకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఆకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్లకు పంట దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాలకు రూ.6.48కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసింది. 33% కన్నా అధికంగా పంట దెబ్బతిన్న కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, కృష్ణా, విజ యనగరం, ఉభయ గోదావరి జిల్లాలకు ఈ నిధులు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పిడుగుపాటుకు మృతి చెందిన గొర్రె లకు ఎస్‌డీఆర్ఎఫ్ నిధుల నుంచి రూ.96వేలు విడుదల చేశారు. ...

X