awareness-program

16 Jun

చిరుధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

అతి తక్కువ పెట్టుబడి, స్వల్ప నీటి వినియోగం, కొద్ది రోజుల్లోనే చేతికి వచ్చే పంటలు… చిరుధాన్యాలు. మరి చిరుధాన్యాలను సాగు చేయడం ఎలా ? రైతులే నేరుగా అమ్ముకునే విధానాలేంటి ? బంజరు భూములను సైతం సారవంతం చేసే పద్ధతులేవి ? ఇలా అనేక అంశాలపై రైతున్నలకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ 2019 జూన్ 16న ఆదివారం ఏర్పాటు చేస్తోంది… ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల పంటల సాగు, మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీ, అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతు శిక్షణా కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్...

09 Jun

కూరగాయల సాగు, కషాయాల తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

కూరగాయల సాగులో తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి పంటకు మంచి ఆదాయం సాగులో శ్రమకు తగ్గ ఫలితం పొందాలని అనుకుంటున్నారా ? అయితేరండి మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోన్న.. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయల సాగు, వివిధ రకాల కషాయాల తయారీపై రైతు శిక్షణా కార్యక్రమానికి హాజరుకండి

29 Oct

దేశీయ ఆహారం, ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలనపై సదస్సు

సిరిధాన్యాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాలని ఉందా…? కషాయాలతో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని అనుకుంటున్నారా…? నిజమైన దేశీయ ఆహార పదార్థాలేమిటో తెలియక అయోమయంలో ఉన్నారా…? అయితే రండి. రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమానికి హాజరుకండి. అక్టోబరు 29, సోమవారం హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో పిల్లర్ నెం. 83 సమీపంలో కొణిజేటి ఎన్‌క్లేవ్‌లోని పల్లవి గార్టెన్స్‌లో సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వతంత్ర శాస్త్రవేత్త, కృషిరత్న డాక్టర్‌ ఖాదర్ వలి పాల్గొని దేశీయ ఆహారం, ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు. సిరిధాన్యాలైన అండు కొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, ఆరికలు, వ్యవసాయ...

26 Oct

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై ఖాదర్‌వలి సదస్సులు

ప్రగతి రిసార్ట్స్‌ రజతోత్సవాల్లో భాగంగా అక్టోబరు 28 ఆదివారం ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే అంశంపై ప్రత్యేక సదస్సును నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటలనుంచి నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని శిల్పారామం సంప్రదాయ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డబ్ల్యూ.ఆర్‌.రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ప్రగతి రిసార్ట్స్ అధినేత జీబీకే రావు, ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సిరిధాన్యాలు, కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యంపై ఖాదర్ వలి అవగాహన కల్పిస్తారు. అనంతరం… ప్రగతి రిసార్ట్స్ మరియు రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శిల్పరామం సంప్రదాయ వేదికలో దేశీయ ఆహారం, ఆధునిక రోగాల...

24 Oct

హైదరాబాద్‌లో ఇంటిపంటలపై రాష్ట్రస్థాయి సదస్సు

ఆధునిక జీవనశైలిలో సహజ ఆహారం అత్యవసరం మరి నేడు మనం తీసుకుంటున్న ఆహారంలో ఆ సహజత్వం ఉందా ? ఈ ప్రశ్నకు అవునని సమాధానం చెప్పలేని పరిస్థితి ఈ నేపథ్యంలో సహజ ఆహారానికి ఉత్తమ వేదిక ఇంటిపంటలు నగరాల్లో ఈ నయా సాగు విధానాన్ని మరింత విస్తృతం‌ చేసేందుకు రైతునేస్తం ఫౌండేషన్ విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యానవనశాఖ సహకారంతో అక్టోబర్ 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటి పంటలపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. హైదరాబాద్ జీడిమెట్లలోని సుచిత్ర దగ్గరగల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ సి. పార్థసారధి IAS, తెలంగాణ రాష్ట్ర...

30 Sep

“సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం – దేశీ ఆహారంతో ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలన” పై అవగాహన సదస్సులు

మారిన ఆహారపు అలవాట్లు మానవ సమాజానికి అతిపెద్ద ముప్పుగా మారాయి. ఆహార పదార్థాల్లో రసాయనాలు, పోషకాల లేమి మధుమేహం, బీపీ, క్యాన్సర్ తదితర రోగాలకు కారణం అవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం.. దేశీ ఆహారమైన సిరిధాన్యాలే. ఈ నేపథ్యంలోనే సంపూర్ణ ఆరోగ్యం కోసం సిరిధాన్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ కృషి చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరుస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, 2న గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం నగరాల్లో “సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం – దేశీ ఆహారంతో ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలన” పై అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో స్వతంత్ర శాస్త్రవేత్త...

18 Sep

హైదరాబాద్‌లో మిద్దెతోటపై అవగాహన సదస్సు

మిద్దెతోటను ప్రారంభించాలని అనుకుంటున్నారా…? ఇంటిపంటలను పండించే మెళకువలు తెలుసుకోవాలని ఉందా…? కూరగాయలు, పండ్లు, తీగజాతి మొక్కలను ఎలా పెంచుకోవాలి…? ఈ సందేహాలకు సమాధానమిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లోని రైతునేస్తం కార్యాలయంలో సెప్టెంబరు 22, 2018 శనివారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కేవలం 80 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. హాజరుకాబోయే వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కొరకు 70939 73999 ఫోన్‌ నెంబరును సంప్రదించగలరు. ...

X