మిద్దెతోటలతో రసాయనిక ఆహారం నుంచి విముక్తి : తెలంగాణ సీఎస్ ఎస్‌.కె. జోషి

పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార అవసరాలను మిద్దెతోటల పెంపకం ద్వారా తీర్చే అవకాశాలు ఉన్నాయని, మిద్దెతోటల పెంపకమే సర్వత్రా శ్రేయస్కరమని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌.కె. జోషి చెప్పారు. రసాయనాలు, క్రిమిసంహారక మందుల వినియోగం లేకుండా కూరగాయలు, పండ్లు, పూలను సాగుచేసుకోవడం ద్వారా ఆహార అవసరాలను తీర్చుకోవడమే కాకుండా వివిధ వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చన్నారు. బుధవారం హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రాష్ట్ర ఉద్యానవనశాఖ, రైతునేస్తం ఆధ్వర్యంలో మిద్దెతోటల సాగు, వర్టికల్ గార్డెనింగ్‌పై రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు జరిగింది. మిద్దెతోటల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేయూత అందిస్తోందని ఎస్‌.కె.జోషి తెలిపారు. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మిద్దెతోటల సాగుపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. రైతునేస్తం...