kitchen garden

14 Aug

సేంద్రియ పద్ధతిలో మిద్దెతోటల పెంపకంపై అవగాహన కార్యక్రమం

మిద్దెతోటపై ఆసక్తి ఉంది !! కానీ ప్రారంభించేది ఎలా ? ఏ మట్టి వాడాలి ? పరికరాలు, విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ? మొక్కలు పెంచేది ఎలా ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ? ఇలా ఎన్నో సందేహాలకు సమాధానలు ఇచ్చి.. మిద్దెతోటల పెంపకంపై మీకు పూర్తి అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్

31 Oct

హైదరాబాద్‌లో మిద్దెతోటపై అవగాహన కార్యక్రమం

మిద్దెతోటను ప్రారంభించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…? కుండీలు, బకెట్లు, డ్రమ్ముల్లో ఇంటిపంటలను ఎలా పండించుకోవాలి…? మొక్కలకు సోకే చీడపీడలు, తెగుళ్లను నివారించే పద్ధతులేంటి…? ఈ సందేహాలకు సమాధానమిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లోని రైతునేస్తం కార్యాలయంలో నవంబరు 03, శనివారం టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్‌లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బకెట్ గార్డెన్ నిపుణులు రవిచంద్ర పాల్గొంటారు. సేంద్రియ పద్ధతిలో ఇంటి పంటల పెంపకం విధానాలను వివరిస్తారు. మిద్దెతోటలపై సందేహాలను నివృత్తి చేస్తారు. రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిద్దెతోటను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. మిద్దెతోట చేపట్టేందుకు అవసరమైన...

18 Sep

హైదరాబాద్‌లో మిద్దెతోటపై అవగాహన సదస్సు

మిద్దెతోటను ప్రారంభించాలని అనుకుంటున్నారా…? ఇంటిపంటలను పండించే మెళకువలు తెలుసుకోవాలని ఉందా…? కూరగాయలు, పండ్లు, తీగజాతి మొక్కలను ఎలా పెంచుకోవాలి…? ఈ సందేహాలకు సమాధానమిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లోని రైతునేస్తం కార్యాలయంలో సెప్టెంబరు 22, 2018 శనివారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కేవలం 80 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. హాజరుకాబోయే వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కొరకు 70939 73999 ఫోన్‌ నెంబరును సంప్రదించగలరు. ...

16 Aug

“మిద్దెతోట”పై కొండాపూర్ లో అవగాహన కార్యక్రమం

మిద్దెపై ఖాళీ స్థలం.. ఇంటి పంటలపై ఆసక్తా ఉందా ? మొక్కల ఎంపిక .. పెంపకం విధానాలపై సందేహాలా ? సేంద్రియ పద్ధతిలో.. స్వచ్ఛమైన ఆహారం ఎలా సాధ్యమో తెలుసుకోవాలా ? అయితే రండి.. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యానవనశాఖ సహకారంతో హైదరాబాద్ కొండాపూర్ లోని క్రితింగ హోటల్ పక్కన గల హోటల్ జూపిటర్ లో జరిగే మిద్దెతోట అవగాహన కార్యక్రమానికి హాజరుకండి. టెర్రస్, బాల్కనీ, కిచెన్ గార్డెనింగ్ లలో సేంద్రియ పద్ధతిలో కూరగయాలు, పూలు, పండ్ల పెంపకం విధానాలు తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ ఎల్. వెంకట్రాం రెడ్డి, శ్రీ కాండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం విశ్రాంత విస్తరణ సంచాలకులు డాక్టర్ రావి చంద్రశేఖర్, హైదరాబాద్ కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బకెట్...

06 Aug

వరంగల్‌లో మిద్దెతోటపై అవగాహన సదస్సు

ఆధునిక యుగంలో తినే ఆహార పదార్థాల నుంచి పీల్చే గాలి వరకు అన్నీ కలుషితమవుతూ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వరంగల్‌జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ ఉషా అన్నారు. ఆదివారం రైతునేస్తం ఫౌండేషన్‌, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్‌ సమావేశం మందిరంలో మిద్దెతోటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మిద్దెతోటల నిర్వహణ ఇతర పద్ధతులను వివరించారు. అనంతరం మిద్దెతోట పెంపకానికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉషా మాట్లాడుతూ.. సేంద్రియ ఎరువులను ఉపయోగించి ఇంటిపై కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను పెంచుకోవచ్చని తెలిపారు. స్వచ్ఛమైన ఆక్సిజన్‌తోపాటు క్రిమి సంహారక మందులు వాడని కూరగాయలు, పండ్లు లభిస్తాయని వివరించారు. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే కూరగాయలలో విషపూరితమైన పదార్థాలుంటున్నాయని పేర్కొన్నారు. వీటిని నివారించేందుకు...

05 Aug

TRAINING PROGRAM ON TERRACE GARDENING, BUCKET GARDENING, KITCHEN GARDENING

Farmers Friend Rythunestham Foundation is conducting training program on terrace gardening, balcony gardening, kitchen gardening methods and Vegetables Cultivation through Nature farming. The Event is Scheduled on 5th August 2018 (Sunday). In association with Telangana Agricultural Department and Telangana Horticulture Department, Rythunestham Foundation is conducting the program. It will be held at ZPP Meeting hall, opposite District Court, Nakkalgutta, Hanmakonda, Warangal District. Warangal District Agricultural JDA Smt. D. Usha, Horticulture DDA R. Srinivas, Terrace Garden expert T. Raghotham Reddy, Bucket...

X