శాస్త్రీయ ప్రగతి ఫలాలు వ్యవసాయరంగానికి అందిస్తాం: ప్రధాని మోదీ

వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని అన్నదాతలు చక్కగా అందిపుచ్చుకుంటారన్న ఆశాభావాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌ లక్నోలో మూడురోజులపాటు జరిగే ‘కృషి కుంభ్‌’ సదస్సు ప్రారంభోత్సవంలో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. ‘విత్తనం నుంచి విపణి’ వరకు రైతుల కోసం… వారి ఉత్పత్తుల కోసం అత్యంత పటిష్ఠమైన మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. సమీప భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా పంటపొలాల్లో పెద్దసంఖ్యలో సౌరశక్తితో పనిచేసే పంపులు ఏర్పాటవుతాయన్నారు. వారణాశిలో వరి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. శాస్త్రీయ ప్రగతి ఫలాలు వ్యవసాయరంగానికి అందేలా చూడటానికి తమ...