natural farming

14 Feb

భూమి బాగుపడితేనే రైతు బాగుపడతాడు

ప్రపంచం మొత్తాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య కాలుష్యం. ప్రజల జీవనసరళి మారటం మరియు అనేక రకాల కారణాల వలన రోజురోజుకి వాతావరణ కాలుష్యం పెరుగుతుందనేది అందరూ అంగీకరించేదే. ప్రజలు అవసరాలను ప్రక్కకు నెట్టి అనుకరణలకు ప్రాముఖ్యతను ఇస్తూ అనవసర వస్తు వినియోగం పెంచడం, పారిశ్రామికీకరణ విపరీతంగా పెరగడం, జనాభా పెరగడం,

06 Feb

రైతుకి సాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’

రైతుకు పెట్టుబడి సాయానికి ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని ప్రకటించింది. ఇందుకోసం 2019-20 బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించింది. అప్పుల ఊబిలో ఉన్న కర్షకులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు 2014లో సర్కారు...

03 Feb

ప్రకృతి వ్యవసాయంలో పండ్లతోటలు, కూరగాయల సాగుపై శిక్షణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2019 ఫిబ్రవరి 3న ఆదివారం ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండ్ల తోటలు, కూరగయాల సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి, డాక్టర్ వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్న గూడెం సీనియర్ సైంటిస్ట్ ఎక్స్ టైన్షన్ అండ్ హెడ్ శ్రీమతి డాక్టర్ కరుణశ్రీ పాల్గొని… ప్రకృతి వ్యవసాయ విధానంలో పండ్ల తోటలు, కూరగాయల సాగుపై శిక్షణ ఇస్తారు. శిక్షణలో భాగంగా కషాయాలు, మిశ్రమాల తయారీని వివరిస్తారు. ఉద్యానశాఖ అందించే రాయితీపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమం ఉదయం 10...

02 Feb

కేంద్ర బడ్జెట్ లో రైతుకి జై.. ఏడాదికి రూ.6 వేల పెట్టుబడి పథకం

రైతునేస్తం: కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేసింది. తెలంగాణ ప్రభుత్వ బాటలోనే కేంద్రం కూడా రైతుబంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టనుందన్న అంచనాలను నిజం చేస్తూ.. తాజా బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పేరిట సరికొత్త పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 5 ఎకరాల లోపు (2 హెక్టార్లు) సాగు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6 వేల పెట్టుబడి సాయం అందించనుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాలోకి బదిలీ చేస్తామని బడ్జెట్ లో పేర్కొంది. 2018...

25 Oct

సేంద్రియ పద్ధతిలో ముందుకు “సాగు”తున్న రైతు శ్రీనివాస్ రెడ్డి

ప్రకృతినేస్తం:   భారతదేశం వ్యవసాయక దేశం. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయ మరియు దాని అనుబంధరంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో 90 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ రంగంలో ఉండేవారు. కాని రాను రాను వేరే రంగాలకు మరలేవారు పెరిగినా కూడా ఇప్పటికీ కూడా వ్యవసాయరంగంపై ఆధారపడి జీవించేవారు 60 శాతానికి పైగా ఉన్నారనేది అక్షరసత్యం. వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన వారు కొంతమంది మొదటిలో వ్యవసాయ రంగంలో  ఉంటూ కొన్ని సంవత్సరాల తరువాత వేరే రంగాలకు మరలడం మరియు ఇతర రంగాలలో కొంతకాలం గడిపిన తరువాత మరలా వ్యవసాయ రంగంలో తిరిగి ప్రవేశించడం ఇటీవల సర్వసాధారణమైంది. ఇదే కోవకు చెందుతాడు నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలం గట్ల మల్లేపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి. వ్యవసాయ...

25 Oct

మారుతున్న పద్ధతులకు అనుగుణంగా “వరిసాగు”

ప్రకృతినేస్తం: వ్యవసాయం ఒక మూస పద్ధతిలో కాకుండా మారుతున్న పరిస్థితులను పరిశీలించుకుంటూ అవకాశం ఉన్నంత వరకు ఆ వచ్చే మార్పులను ఆకళింపు చేసుకుంటూ పంటల సాగు కొనసాగించ గలిగినపుడే రైతు నిలదొక్కుకోగలడు. అలాకాకుండా ఒకే మూస పద్ధతిని గుడ్డిగా పాటించినట్లయితే వ్యవసాయంలో విజయం సాధించటం కష్టమవుతుంది. ప్రస్తుతం మారుతున్న కాలమాన పరిస్థితులు మరియు సాంకేతికత అభివృద్ధి చెందిన నేటి పరిస్థితులలో సమాచారం చాలా వేగవంతంగా ప్రపంచ నలుమూలలకు చేరుతుంది. ఈ పరిణామాన్ని వ్యవసాయంలో  ఉపయోకరంగా రైతులు మలచుకుంటున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ బాటలోనే నడుస్తూ ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వచ్చిన కొత్త పద్ధతులను ఉపయోగించుకుంటూ వరి పంటను సాగుచేస్తున్నాడు గుంటూరు జిల్లా చిర్రావూరుకి చెందిన నాగభూషణం. నాగభూషణం మొత్తం 6...

09 Sep

మట్టిద్రావణంపై రైతు అవగాహన కార్యక్రమం

సహజ సేద్యంపై ఆసక్తి ఉంటే అందుబాటులో అనేక విధానాలు వాటిని సరైన రీతిలో అమలు చేస్తే సాగులో మంచి దిగుబడులు సాధ్యం అలాంటి విధానాల్లో ఒకటి మట్టి ద్రావణం ఈ ద్రావణం పిచికారితో పంటలకు సమగ్ర పోషకాలు లభ్యం చీడపీడలు పలాయనం ఈ నేపథ్యంలో.. మట్టిద్రావణం తయారీ విధానాలు, ప్రాముఖ్యతలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది ప్రత్యేక అవగాహన కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2018 సెప్టెంబర్ 9న ఈ కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాద్ కు చెందిన సేంద్రియ రైతు చింతల వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని… ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలను ఆశించు పురుగులు మరియు తెగుళ్ల నివారణకు సీవీఆర్...

24 Aug

సేంద్రియ ఉత్పత్తులకు స్కోప్ సర్టిఫికెట్

రైతునేస్తం: సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. రసాయన ఎరువులతో పండించిన ఆహారం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందన్న ఆవేదన ఇటీవల కాలంలో ప్రజల్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో సహజ పద్ధతుల్లో పండించిన పంట ఉత్పత్తుల వైపు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే.. సేంద్రియ సేద్యం చేస్తున్న రైతులు ప్రస్తుతం తక్కువగా ఉండటం.. కావాల్సినంత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో లేకపోవటంతో డిమాండ్ పెరుగుతోంది. ఇదే అదునుగా కొంత మంది రసాయనాలు, పురుగుమందులతో పండించిన వాటిని కూడా సేంద్రియ బ్రాండ్ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ.. సేంద్రియ ధ్రువీకరణను ఇటీవల ప్రారంభించింది. ఈ మేరకు అపెడా నుంచి అనుమతి పొందిన సంస్థ.....

16 Aug

ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగు శిక్షణ

పత్తి, మిరప సాగు చేస్తున్న రైతులా ? మేలైన సస్యరక్షణ చర్యల కోసం చూస్తున్నారా ? అయితే రండి… మీ కోసమే రైతునేస్తం ఏర్పాటు చేస్తోంది.. ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2018 ఆగస్టు 19న ‍‍(ఆదివారం‌‌‌) ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణలో మహబూబ్ నగర్ జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీమతి లావణ్య పాల్గొని.. ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగు విధానాలను వివరిస్తారు. విజయవాడకు చెందిన రహమతుల్లా…. వివిధ పంటల్లో చీడపీడల నివారణలో లింగార్షక బుట్టల ప్రాముఖ్యతను, పత్తిలో గులాబి...

X