nature farming

23 Jun

విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులు

బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, ఇలా… ఆధునిక ఆహార అలవాట్లు ఇలాంటి అనేక రోగాలకు కారణం అవుతున్నాయి. స్వచ్ఛమైన దేశీయ ఆహారం సరైన జీవన విధానంతో ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలన సాధ్యం. ఈ నేపథ్యంలో.. సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై తెలుగు రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోన్న రైతునేస్తం ఫౌండేషన్…. జూన్ 23, 24 తేదీలలో విజయవాడ

09 Jun

కూరగాయల సాగు, కషాయాల తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

కూరగాయల సాగులో తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి పంటకు మంచి ఆదాయం సాగులో శ్రమకు తగ్గ ఫలితం పొందాలని అనుకుంటున్నారా ? అయితేరండి మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోన్న.. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయల సాగు, వివిధ రకాల కషాయాల తయారీపై రైతు శిక్షణా కార్యక్రమానికి హాజరుకండి

02 Jun

భూసార పరిరక్షణ, చీడపీడల నివారణపై రైతు శిక్షణా కార్యక్రమం

సాగు చేసే నేల బాగుంటేనే పంట బాగా పండుతుంది. రైతుకి ఆదాయం దక్కుతుంది. అందుకే.. ప్రతి రైతు ప్రథమ కర్తవ్యం భూసారాన్ని రక్షించుకోవడం. ఈ నేపథ్యంలో మట్టికి పునరుజ్జీవం కల్పించేందుకు పాటించాల్సిన పద్ధతులు ప్రకృతి వ్యవసాయంలో ఉన్న అవకాశాలు తెలుసుకునేందుకు … రండి రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2019

26 May

మిరప, పత్తి, కంది పంటల సాగు మరియు పంటల అవశేషాలను సేంద్రియ ఎరువుగా మార్చే విధానాలపై రైతు శిక్షణా కార్యక్రమం

మీరు.. మిరప, పత్తి, కంది రైతులా ? తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు మంచి లాభాలు పొందే మార్గాల కోసం చూస్తున్నారా ? అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది… ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో విజయవంతంగా సాగుతున్న రైతులు, వ్యవసాయ నిపుణులచే… ప్రకృతి, సేంద్రియ విధానంలో మిరప, పత్తి, కంది పంటల సాగు మరియు పంటల అవశేషాలను సేంద్రియ ఎరువుగా మార్చే విధానాలపై రైతు శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2019 మే 26న తేదీ ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా ప్రకృతి రైతు లావణ్యా రెడ్డి, వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చడంలో నిపుణులైన హైదరాబాద్ కు...

09 Dec

గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరులో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు

అనారోగ్య సమస్యలతో బాధలా? బాగు చేసే మార్గం కోసం చూస్తున్నారా ? ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కోసం వెతుకుతున్నారా ? అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి గారిచే సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరు నగరాల్లో ఈ కార్యక్రమాల్లో కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని సిరిధాన్యాలు, కషాయాలతో షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తదితర రోగాల నిర్మూలన, నియంత్రణపై అవగాహన కల్పిస్తారు….. కార్యక్రమాల తేదీలు, వేదికలు…. ☛ గూడూరులో… డిసెంబర్ 9 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వేదిక : దవ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాల్, ఐ.సి.ఎస్. రోడ్, గూడూరు

04 Nov

చిరుధాన్యాల సాగు, మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

చిరుధాన్యాల సాగు పద్ధతులు తెలుసుకోవాలని ఉందా…? అటవీ చైతన్య ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలి…? మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి…? ఈ ప్రశ్నలకు సమాధానం అందిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘రైతు శిక్షణా కేంద్రం’లో నవంబర్ 4 ఆదివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కృషిరత్న, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్ వలిగారి మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీ మరియు అటవీ చైతన్య ద్రావణం తయారీ విధానం మరియు చిరుధాన్యాల సాగుపద్ధతిపై శిక్షణ ఇస్తారు. కృషిరత్న డాక్టర్‌ ఖాదర్ వలి గారి అనుయాయి, సహజ వ్యవసాయ పద్దతి నిపుణుడు, మైసూరుకు చెందిన బాలన్ బృందం రైతులకు అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణా కార్యక్రమం...

26 Oct

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లల్లో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గిందని వ్యవసాయశాఖ అధికారులు గురువారం కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. రసాయన ఎరువుల వినియోగం 5.21 లక్షల మెట్రిక్‌ టన్నులు తగ్గగా, రైతులకు రూ.943.77 కోట్ల సొమ్ము ఆదా అయ్యిందని, కేంద్ర ప్రభుత్వానికి రూ.815.63 కోట్ల రాయితీ ఆదా అయ్యిందని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డి వివరించారు. పురుగు మందుల వినియోగం 2208.84 మెట్రిక్‌ టన్నులు తగ్గడంతో రూ.1933 కోట్లు రైతులకు ఆదా అయ్యిందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ ఏడాది 96 శాతం పంటను ఈ-క్రాప్‌ కింద నమోదు చేశామని, మిగిలిన 4 శాతాన్ని నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఖరీఫ్‌లో 102 శాతం సూక్ష్మపోషకాలను రైతులకు పంపిణీ చేశామని, రబీలో 1.75...

21 Oct

గో ఆధారిత సమీకృత సహజ సేద్యంపై రైతు శిక్షణ కార్యక్రమం

నేలతల్లి సహజత్వాన్ని కాపాడుతూ… సేంద్రియ వ్యవసాయంలో అనుసరించాల్సిన పద్ధతులపై రైతునేస్తం ఫౌండేషన్‌ రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గో ఆధారిత సమీకృత సహజ సేద్య నిపుణులు, కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్‌కు చెందిన ప్రముఖ రైతు ఎల్‌. నారాయణ రెడ్డి సమీకృత సహజ సేద్యం, ఆహారం, జీవన విధానం సహా వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. అక్టోబర్‌ 21 ఆదివారం హైదరాబాద్‌లోని లక్డీకపూల్‌ రెడ్‌హిల్స్ కాలనీలోని ఫ్యాప్సీ భవన్‌ కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమానికి హాజరుకావాలనుకునేవారు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కొరకు https://www.instamojo.com/rotarycsw/naturalfarming/ లింక్‌ను క్లిక్‌ చేయగలరు. మరిన్ని వివరాలకు 70939 73999, 96767...

17 Sep

ప్రకృతి సేద్యంపై ప్రసంగించాల్సందిగా ఐక్యరాజ్యసమితి నుంచి చంద్రబాబుకి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం లభించింది. న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆయన్ని యూఎన్ఓ ఆహ్వానించింది. వ్యవసాయంలో ఆర్థిక సుస్థిరత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలపై సెప్టెంబరు 24న న్యూయార్క్‌లోని యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో జరిగే సదస్సులో ప్రసంగించాల్సిందిగా కోరుతూ ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు యూఎన్ఓ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ సోల్తెయిమ్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఏపీలో సేంద్రియ సాగుపై న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ఏపీలో అనుసరిస్తున్న సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల గురించి గతంలో న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ ప్రత్యేక కథనం కూడా ప్రచురించింది. ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం కోసం...

20 Aug

ప్రకృతి సేద్యంలో కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై శిక్షణ

‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో… 2018 ఆగస్టు 26వ తేదీ ఆదివారం.. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నూతక్కికి చెందిన మహిళా రైతు శ్రీమతి ఉష, మరో రైతు ధర్మారం బాజి పాల్గొని పంచగవ్య, జీవామృతం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయం, తులసి – కలబంద కషాయం, పచ్చగన్నేరు – కలబంద కషాయం, ఇంగువ ద్రావణం, పుల్లటి మజ్జిగ – శొంఠి కషాయం మొదలైన వాటి తయారీ, వాడకంపై అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా కొన్ని కషాయాలను ప్రత్యక్షంగా తయారుచేసి చూపిస్తారు....

X