ప్రకృతినేస్తం: భారతదేశం వ్యవసాయక దేశం. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయ మరియు దాని అనుబంధరంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో 90 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ రంగంలో ఉండేవారు. కాని రాను రాను వేరే రంగాలకు మరలేవారు పెరిగినా కూడా ఇప్పటికీ కూడా వ్యవసాయరంగంపై ఆధారపడి జీవించేవారు 60 శాతానికి పైగా ఉన్నారనేది అక్షరసత్యం. వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన వారు కొంతమంది మొదటిలో వ్యవసాయ రంగంలో ఉంటూ కొన్ని సంవత్సరాల తరువాత వేరే రంగాలకు మరలడం మరియు ఇతర రంగాలలో కొంతకాలం గడిపిన తరువాత మరలా వ్యవసాయ రంగంలో తిరిగి ప్రవేశించడం ఇటీవల సర్వసాధారణమైంది. ఇదే కోవకు చెందుతాడు నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలం గట్ల మల్లేపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి. వ్యవసాయ...
రైతునేస్తం:సేంద్రియ ఉత్పత్తుల విక్రయానికి జిల్లాకో సూపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తద్వారా రైతులకు అధిక ధర లభించేలా చూస్తామని అన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నారని… ఇటువంటి పంటలు పండిస్తున్న రైతులకు మంచి ధరలు లభిస్తే ఇతర రైతులు కూడా సేంద్రియ వ్యవసాయంవైపు మరలుతారని అన్నారు. రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ ద్వారా ‘సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ’ను ఆగస్టు 13న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో పోచారం ప్రారంభించారు. సేంద్రియ ధ్రువీకరణ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం రైతులు...