గో ఆధారిత సమీకృత సహజ సేద్యంపై రైతు శిక్షణ కార్యక్రమం

నేలతల్లి సహజత్వాన్ని కాపాడుతూ… సేంద్రియ వ్యవసాయంలో అనుసరించాల్సిన పద్ధతులపై రైతునేస్తం ఫౌండేషన్‌ రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గో ఆధారిత సమీకృత సహజ సేద్య నిపుణులు, కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్‌కు చెందిన ప్రముఖ రైతు ఎల్‌. నారాయణ రెడ్డి సమీకృత సహజ సేద్యం, ఆహారం, జీవన విధానం సహా వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. అక్టోబర్‌ 21 ఆదివారం హైదరాబాద్‌లోని లక్డీకపూల్‌ రెడ్‌హిల్స్ కాలనీలోని ఫ్యాప్సీ భవన్‌ కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమానికి హాజరుకావాలనుకునేవారు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కొరకు https://www.instamojo.com/rotarycsw/naturalfarming/ లింక్‌ను క్లిక్‌ చేయగలరు. మరిన్ని వివరాలకు 70939 73999, 96767...