ritunestham

18 Aug

కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై శిక్షణా కార్యక్రమం

రైతు సంక్షేమానికి… ప్రజా ఆరోగ్యానికి.. ఉత్తమ విధానం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం. జీవామృతం.. బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం.. పంచగవ్య తదితర కషాయాలు, మిశ్రమాలే సహజ సేద్యంలో కీలకం. ఈ నేపథ్యంలో ఈ కషాయాలను ఎలా తయారు చేసుకోవాలి ? పంటకు ఏ సమయంలో ఏ కషాయం వాడాలి ? తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకురైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారంప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ...

04 Aug

సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం

వర్షాభావ పరిస్థితుల్లో రైతుల ముందున్న ఉత్తమ విధానం.. అతి తక్కువ నీటితో సాగే సేద్యం. వీటిలో… చిరుధాన్యాల పంటలే మంచి ప్రత్యామ్నాయం. మరి చిరుధాన్యాలను సాగు చేయడం ఎలా ? ఏ పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది ? ఇలా అనేక అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ 2019 ఆగస్టు 4వ తేదీ ఆదివారం ఏర్పాటు చేస్తోంది… సేంద్రీయ వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల పంటల సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, ఈ విధానంలో చిరుధాన్యాల పంటలు...

01 Aug

అనుభవం కలిగిన అగ్రికల్చర్ బీఎస్సీ, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులను ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తూ.. వారికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్. వ్యవసాయ

21 Jul

దానిమ్మ, తైవాన్ జామ, అంజూర సేంద్రియ సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం

దానిమ్మ… తైవాన్ జామ…. అంజూర…. వీటిలో మీరు ఏ పంటనైనా సాగు చేస్తున్నారా ? లేక కొత్తగా సాగు ప్రారంభించాలనుందా ? అయితే.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారం జూలై 21న ఆదివారం ఏర్పాటు చేస్తోంది…. సేంద్రియ వ్యవసాయ విధానంలో దానిమ్మ

14 Jul

ప్రకృతి సేద్యంలో బొప్పాయి, కూరగాయలు, మునగ సాగుపై రైతు శిక్షణ

మీరు బొప్పాయి, కూరగాయలు, మునగ రైతులా ? సాగులో అతి తక్కువ పెట్టుబడి పంటలో నాణ్యమైన దిగుబడి అధిక లాభాలు అందించే విధానం కోసం చూస్తున్నారా ? అయితే.. ప్రకృతి వ్యవసాయ విధానమే ఉత్తమ ప్రత్యామ్నాయం మరి మొదలు పెట్టేది ఎలా ? ముందుకు సాగేదెలా అనుకుంటున్నారా ? రండిమీ...

08 Jul

ఏపీ రైతు దినోత్సవం – జూలై 8 – వైఎస్ఆర్ రైతునేస్తం అవార్దుల ప్రదానోత్సవం

అన్నదాతల ఆప్తుడు, వ్యవసాయంలో విప్లవాత్మక పథకాలకు ఆద్యుడు, దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి. జూలై 8న ఆ మహానేత జయంతి. ఈ నేపథ్యంలోరైతు బాంధవుడు రాజన్న జయంతిని పురస్కరించుకొని ఆ రోజుని రైతు దినోత్సవంగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ...

30 Jun

సేంద్రియ సాగులో మిరప, పత్తి, వరిసాగుపై రైతు శిక్షణ

తొలకరి పలకరించింది… నేల తల్లి పులకరించింది. కానీ.. పొలం బాట పట్టిన రైతన్నలను పెట్టుబడులు కలవరపెడుతున్నాయి ఈ నేపథ్యంలో.. అతి తక్కువ పెట్టుబడితో కూడిన సేంద్రియ వ్యవసాయమే ఉత్తమ ప్రత్యామ్నాయం. ఈ విధానంలో మిరప, ప్రత్తి, వరి సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఏర్పాటు చేస్తోంది ప్రత్యేక శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా

09 Jun

కూరగాయల సాగు, కషాయాల తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

కూరగాయల సాగులో తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి పంటకు మంచి ఆదాయం సాగులో శ్రమకు తగ్గ ఫలితం పొందాలని అనుకుంటున్నారా ? అయితేరండి మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోన్న.. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయల సాగు, వివిధ రకాల కషాయాల తయారీపై రైతు శిక్షణా కార్యక్రమానికి హాజరుకండి

28 Apr

నీటి నిల్వ, వాన నీటి పొదుపు, నీటి కుంటల ప్రాముఖ్యతపై రైతు అవగాహన కార్యక్రమం

ఓ వైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు నీరు లేక వెలవెలబోతున్న జలవనరులు ఈ నేపథ్యంలో రానున్న వర్షాకాలంలో ఆకాశం నుంచి జాలువారే ప్రతి వర్షపు చినుకుని ఒడిసి పడితేనే.. సాగు సాగుతుంది. మరి వాన నీటిని ఎలా నిల్వ చేసుకోవాలి ? పొలంలో నీటి చుక్కలను పొదుపు చేసే పద్ధతులేవి ? ఈ అంశాల్లో సమగ్ర వివరాలను రైతులకు తెలియజేసేందుకు రైతునేస్తం ఏర్పాటు చేస్తోంది

21 Apr

వేసవిలో కూరగాయల సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం

వేసవిలో కూరగాయల సాగుపై ఆసక్తి ఉందా ? ప్రకృతి, సేంద్రియ సాగు విధానాలు తెలుసుకోవాలా ? ఉద్యానశాఖ అందించే రాయితీ వివరాలు కావాలా ? అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది.. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో కూరగాయల సాగు, ఉద్యానశాఖ అందించే రాయితీ వివరాలపై రైతు శిక్షణ కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2019 ఏప్రిల్ 21న ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా రైతు శివనాగ మల్లేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వేసవిలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో కూరగాయల సాగు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక...

X