ritunestham

22 Feb

తెలంగాణ బడ్జెట్ 2019 – 20 : నాలుగు దశల్లో రుణమాఫీ

టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. శాస‌న‌స‌భ‌లో ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 22న రూ.1,82,017

18 Nov

సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల తయారీపై రైతు శిక్షణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2018 నవంబర్ 18 ఆదివారం సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల తయారీ విధానంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రైతు కొప్పుల శ్రీలక్ష్మీ పాల్గొని రైతు స్థాయిలో సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల తయారీపై శిక్షణ ఇస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి. ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 83675 35439, 97053 83666, 96767 97777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ...

25 Oct

సేంద్రియ పద్ధతిలో ముందుకు “సాగు”తున్న రైతు శ్రీనివాస్ రెడ్డి

ప్రకృతినేస్తం:   భారతదేశం వ్యవసాయక దేశం. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయ మరియు దాని అనుబంధరంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో 90 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ రంగంలో ఉండేవారు. కాని రాను రాను వేరే రంగాలకు మరలేవారు పెరిగినా కూడా ఇప్పటికీ కూడా వ్యవసాయరంగంపై ఆధారపడి జీవించేవారు 60 శాతానికి పైగా ఉన్నారనేది అక్షరసత్యం. వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన వారు కొంతమంది మొదటిలో వ్యవసాయ రంగంలో  ఉంటూ కొన్ని సంవత్సరాల తరువాత వేరే రంగాలకు మరలడం మరియు ఇతర రంగాలలో కొంతకాలం గడిపిన తరువాత మరలా వ్యవసాయ రంగంలో తిరిగి ప్రవేశించడం ఇటీవల సర్వసాధారణమైంది. ఇదే కోవకు చెందుతాడు నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలం గట్ల మల్లేపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి. వ్యవసాయ...

25 Oct

మారుతున్న పద్ధతులకు అనుగుణంగా “వరిసాగు”

ప్రకృతినేస్తం: వ్యవసాయం ఒక మూస పద్ధతిలో కాకుండా మారుతున్న పరిస్థితులను పరిశీలించుకుంటూ అవకాశం ఉన్నంత వరకు ఆ వచ్చే మార్పులను ఆకళింపు చేసుకుంటూ పంటల సాగు కొనసాగించ గలిగినపుడే రైతు నిలదొక్కుకోగలడు. అలాకాకుండా ఒకే మూస పద్ధతిని గుడ్డిగా పాటించినట్లయితే వ్యవసాయంలో విజయం సాధించటం కష్టమవుతుంది. ప్రస్తుతం మారుతున్న కాలమాన పరిస్థితులు మరియు సాంకేతికత అభివృద్ధి చెందిన నేటి పరిస్థితులలో సమాచారం చాలా వేగవంతంగా ప్రపంచ నలుమూలలకు చేరుతుంది. ఈ పరిణామాన్ని వ్యవసాయంలో  ఉపయోకరంగా రైతులు మలచుకుంటున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ బాటలోనే నడుస్తూ ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వచ్చిన కొత్త పద్ధతులను ఉపయోగించుకుంటూ వరి పంటను సాగుచేస్తున్నాడు గుంటూరు జిల్లా చిర్రావూరుకి చెందిన నాగభూషణం. నాగభూషణం మొత్తం 6...

22 Oct

పత్తి మార్కెట్ ధర రూ.5,550

వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది పత్తికి ఆశాజనకమైన మద్దతు ధర లభిస్తుందని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.5,450గా ఉందని..మార్కెట్లో వ్యాపారులు వంద రూపాయలు ఎక్కువగా ఇచ్చి.. రూ.5,550కి మించి కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు రావాల్సిన అవసరం రైతులకు పెద్దగా ఉండకపోవచ్చన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దిగుబడులు తగ్గుతుండటంతోనే.. పత్తికి డిమాండ్‌ పెరిగిందని.. అందుకే మంచి ధర వస్తుందని వెల్లడించారు. ‘ఈసారి పత్తికి కనీస మద్దతు ధరకన్నా ఎక్కువగా.. మంచి ధర వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల దళారులు మాయమాటలు చెప్పినా.. రైతులు పత్తిని ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దు. తేమ...

20 Sep

పరిహారం ఆలస్యం చేస్తే బీమా కంపెనీలకు జరిమానా

పంటల బీమా సొమ్ము కోసం ఎదురుచూసే రైతులకు శుభవార్త. బీమా క్లెయిమ్‌ సెటిల్‌ చేయకుండా ఆలస్యం చేస్తూ రైతులను ఏడిపించే పరిస్థితికి కేంద్రం అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 19న కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులకు బీమా పరిహారం క్లెయిమ్స్‌ సెటిల్‌ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలు, సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలచేస్తూ ఆయా రాష్ట్రాలకు పంపించింది. సెటిల్‌మెంటు చేయడంలో నిర్ణీతకాల పరిమితి రెండు నెలలు దాటితే 12 శాతం వడ్డీ రైతులకు చెల్లించాలని బీమా కంపెనీలను ఆదేశించింది. అలాగే కంపెనీల విన్నపం మేరకు తమ వాటా సబ్సిడీ...

14 Sep

హైదరాబాద్ లో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం అవగాహన సదస్సులు

వ్యవసాయ నేలలను ఎలా పరిరక్షించుకోవాలి…. చవుడు నేలలను సారవంతమైన భూములుగా ఎలా మార్చుకోవాలి…. సేంద్రియ విధానంలో చీడపీడలను ఎలా నివారించుకోవాలి…. ఈ సందేహాలకు సమాధానమిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. ప్రకృతి వ్యవసాయంపై వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన పెంచుతోన్న రైతునేస్తం ఫౌండేషన్‌ ఇకమీదట ప్రతి శనివారం హైదరాబాద్ లో అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది.  రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లోని రైతునేస్తం కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబరు 15, 2018  శనివారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ప్రకృతి వ్యవసాయం విధానంలో భాగంగా వ్యవసాయ నేలలు, చవుడు నేలలు మరియు చీడపీడల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించనుంది. వ్యవసాయశాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన డాక్టర్ రామచంద్రం...

07 Jul

ఏపీలో జూలై 7-14 వరకు పశుగ్రాస వారోత్సవాలు

రైతునేస్తం: రాష్ట్రవ్యాప్తంగా జూలై 7 నుంచి 14 వరకు పశుగ్రాస వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలను అన్ని మండలాల్లోని పశువైద్యశాలల్లో జరుపుతున్నారు. ఇందులో పశుగ్రాస పెంపకం, పాల ఉత్పత్తి, మేలు జాతి పశుగ్రాసాల విత్తనాలు, గడ్డి కత్తిరించే యంత్రాలపై అవగాహన కల్పిస్తారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పశుగ్రాసం సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు రాయితీపై పశుగ్రాస విత్తనాలు సరఫరా చేస్తారు. ఒక్క రూపాయికే కిలో పచ్చిమేత, రూ.2కు కిలో సైలేజిని, రూ.3లకే కిలో ఎండుమేత, రూ.3.50లకు కిలో సంపూర్ణ దాణా మిశ్రమం, రూ.4లకే కిలో దాణా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు పశుసంవర్థకశాఖ సంచాలకులు సోమశేఖరం తెలిపారు. ...

05 Jul

వరి కనీస మద్దతు ధర రూ.200 పెంపు

రైతునేస్తం: రైతుల పెట్టుబడి వ్యయంపై 50 శాతం పైగా లాభం వచ్చేలా పంటల ధరలు నిర్ణయిస్తామని ఈ ఏడాది బడ్జెట్ లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇందుకు అనుగుణంగా విధాన నిర్ణయాలు ప్రకటించింది. ఈ మేరకు 2018-19 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధరలను ప్రకటించింది. జూలై 4న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ… మద్దతు ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. పెట్టుబడి వ్యయంపై రైతుకు 50 శాతం అధికంగా ఆదాయం వచ్చేలా ధరలు నిర్ణయించినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడించారు. పంట వ్యయం, కుటుంబ శ్రమ, కూలీల ఖర్చులను పరిగణనలోకి తీసుకొని...

X