ritunestham

14 Sep

హైదరాబాద్ లో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం అవగాహన సదస్సులు

వ్యవసాయ నేలలను ఎలా పరిరక్షించుకోవాలి…. చవుడు నేలలను సారవంతమైన భూములుగా ఎలా మార్చుకోవాలి…. సేంద్రియ విధానంలో చీడపీడలను ఎలా నివారించుకోవాలి…. ఈ సందేహాలకు సమాధానమిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. ప్రకృతి వ్యవసాయంపై వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన పెంచుతోన్న రైతునేస్తం ఫౌండేషన్‌ ఇకమీదట ప్రతి శనివారం హైదరాబాద్ లో అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది.  రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లోని రైతునేస్తం కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబరు 15, 2018  శనివారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ప్రకృతి వ్యవసాయం విధానంలో భాగంగా వ్యవసాయ నేలలు, చవుడు నేలలు మరియు చీడపీడల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించనుంది. వ్యవసాయశాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన డాక్టర్ రామచంద్రం...

07 Jul

ఏపీలో జూలై 7-14 వరకు పశుగ్రాస వారోత్సవాలు

రైతునేస్తం: రాష్ట్రవ్యాప్తంగా జూలై 7 నుంచి 14 వరకు పశుగ్రాస వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలను అన్ని మండలాల్లోని పశువైద్యశాలల్లో జరుపుతున్నారు. ఇందులో పశుగ్రాస పెంపకం, పాల ఉత్పత్తి, మేలు జాతి పశుగ్రాసాల విత్తనాలు, గడ్డి కత్తిరించే యంత్రాలపై అవగాహన కల్పిస్తారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పశుగ్రాసం సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు రాయితీపై పశుగ్రాస విత్తనాలు సరఫరా చేస్తారు. ఒక్క రూపాయికే కిలో పచ్చిమేత, రూ.2కు కిలో సైలేజిని, రూ.3లకే కిలో ఎండుమేత, రూ.3.50లకు కిలో సంపూర్ణ దాణా మిశ్రమం, రూ.4లకే కిలో దాణా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు పశుసంవర్థకశాఖ సంచాలకులు సోమశేఖరం తెలిపారు. ...

05 Jul

వరి కనీస మద్దతు ధర రూ.200 పెంపు

రైతునేస్తం: రైతుల పెట్టుబడి వ్యయంపై 50 శాతం పైగా లాభం వచ్చేలా పంటల ధరలు నిర్ణయిస్తామని ఈ ఏడాది బడ్జెట్ లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇందుకు అనుగుణంగా విధాన నిర్ణయాలు ప్రకటించింది. ఈ మేరకు 2018-19 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధరలను ప్రకటించింది. జూలై 4న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ… మద్దతు ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. పెట్టుబడి వ్యయంపై రైతుకు 50 శాతం అధికంగా ఆదాయం వచ్చేలా ధరలు నిర్ణయించినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడించారు. పంట వ్యయం, కుటుంబ శ్రమ, కూలీల ఖర్చులను పరిగణనలోకి తీసుకొని...

03 Jul

పశువులకు సంక్రమించే వ్యాధులకు ఆయుర్వేద, హోమియో చికిత్సా విధానాలపై శిక్షణా కార్యక్రమం

పాడి ఉన్న ఇంట సిరుల పంట అన్నారు పెద్దలు. అందుకే మన పూర్వీకులు వ్యవసాయంతోపాటు పాడిపశువులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈరోజుల్లో వాటి పెంపకం, సంరక్షణ రైతులకు పెద్దసవాలుగా మారింది. ముఖ్యంగా పశువులకు సంక్రమించే వ్యాధులకు ఎలాంటి చికిత్స చేయించాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై దృష్టిసారించిన రైతునేస్తం ఫౌండేషన్‌… గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతు శిక్షణా కేంద్రంలో 2018 జులై 8వ తేదీ ఆదివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పశువులకు సంక్రమించే వ్యాధులకు ఆయుర్వేద మరియు హోమియో చికిత్సా విధానాలపై రైతులకు అవగాహన కల్పించనుంది. ఈ కార్యక్రమంలో భీమవరం పశుసంవర్థకశాఖ ఉప సంచాలకులు డా. ఎస్.టి.జి. సత్యగోవింద్, వరంగల్ వెటర్నరీ హాస్పిటల్...

29 Jun

గట్టు ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

రైతునేస్తం : నడిగడ్డను సుభిక్షం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 29న (శుక్రవారం) శంకుస్థాపన చేశారు. రూ. 553.98 కోట్ల అంచనా వ్యయంతో 33 వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో ఈ పథకాన్ని చేపడుతున్నారు. రేలంపాడు రిజర్వాయర్ నుంచి 2.8 టీఎంసీల నీటిని ఎత్తిపోసి కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేశామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలతో పాలమూరు ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు,...

29 Jun

‘ఏరువాక’ ప్రారంభం

వ్యవసాయ పనులు మొదలు పెట్టడాన్ని వేడుకలా జరిపే ‘ఏరువాక’ పౌర్ణమి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 28న (గురువారం) శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ప్రారంభించారు. సంప్రదాయ దుస్తులైన పంచెకట్టి.. తలపాగా చుట్టి ఎడ్లబండిపై పొలానికి వచ్చారు. రైతన్నలతో కలిసి ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నారు. పొలంలో విత్తనాలు చల్లారు. మహిళలతో కలిసి నారు వేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు.. ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. రైతులకు అన్ని వేళలా ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఏ కష్టమూ రానివ్వకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది అని అన్నారు. ఉపాధి హామిని వ్యవసాయంతో అనుసంధానించాలి : చంద్రబాబు దేశానికి అన్నం పెట్టే రైతన్న సమాజంలో ఆనందంగా...

26 Jun

వర్షాధార కూరగాయల సాగుకు ఇదే అనువైన సమయం

కాలువలు, బోర్లు, బావులు ఎక్కువగా లేని రోజుల్లో ఆహార పంటలు, కూరగాయలను ఖరీఫ్‌లో వర్షాధారంగా పండించేవారు. వర్షాధార కూరగాయల్లో టమాట, వంగ, మిరప ప్రధానమైనవి. గోరుచిక్కుడు, చిక్కుడు, ఉల్లి, తీగజాతికి చెందిన సొర, బీర, కాకర, దోసలను చిరుధాన్యాల్లో అంతరపంటలుగా విత్తి, ఆహార అవసరాలు తీర్చుకునేవారు. శాకాహారం ప్రధానమైన తెలుగు రాష్ట్రాలను కూరగాయల కరువు వెంటాడుతోంది. అందువల్ల మెట్ట పైర్లలో అంతరపంటలుగా కూరగాయల పెంపకం చేపట్టి, వాననీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందు కోసం.. బెట్టను, అధిక వర్షాలను తట్టుకోగల సూటిర కాలనే విత్తాలి. వీటి సాగు ఖర్చు తక్కువ. టమాట, వంగ, మిరప, ఉల్లి విత్తనాలను నారుపోసి నాటాలి. మిగతా వర్షాధార కూరగాయలను నేలలో తేమ చూసుకొని విత్తుకోవాలి. నాణ్యమైన అధిక...

18 Jun

రొయ్యలసాగు రైతులకు స్మార్ట్‌ కార్డులు

రొయ్యల సాగు రైతులను ప్రోత్సహించే దిశగా కీలక ముందుడగు పడింది. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యలు సాగుచేస్తున్నా ఏ ప్రాంతంలో ఎంత సాగు అవుతుంది? ఏ రైతు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడు అనే విషయాలపై ప్రభుత్వం వద్ద కచ్చితమైన గణాంకాలు లేవు. గతేడాది నుంచి అమెరికా, యూరోపియన్‌ దేశాలు మన రొయ్యల దిగుమతిపై నిబంధనలు కఠినతరం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల సాగుపై ఎనిమిది నెలల కిందట శాటిలైట్‌ సర్వే ప్రారంభించాయి. అందులో భాగంగా ప్రస్తుతం రొయ్యల సాగు రైతులకు స్మార్ట్‌ కార్డులు జారీచేస్తున్నాయి.  రొయ్యల సాగు రైతులను ప్రోత్సహించే దిశగా కీలక ముందుడగు పడింది. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యలు సాగుచేస్తున్నా ఏ ప్రాంతంలో...

13 Jun

వ్యవసాయ యంత్ర పరికరాలు – రైతునేస్తాలు

సాంకేతిక విప్లవం.. అన్ని రంగాల్లో భారీ  మార్పులు తీసుకొచ్చింది. సేద్యం ఇందుకు మినహాయింపేం కాదు. గతంలో స్వేదమే ప్రధాన పెట్టుబడిగా ఉన్న వ్యవసాయంలో… నేడు ఎన్నో ఆధునిక పద్ధతులు ఆవిష్కృతం అయ్యాయి. రైతు శ్రమని, కూలీల ఖర్చుని తగ్గించి.. అధిక దిగుబడులు ఇచ్చే అనేక ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. విత్తనం వేసింది మొదలు.. పంటలు కోసే వరకు ఉపయోగించే వివిధ రకాల వ్యవసాయ యంత్రాలను అనేక మంది ఔత్సాహిక శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాత అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఆధునిక సాగు పరికరాలపై రైతులకు అవగాహన పెంచేందుకు “రైతునేస్తం ఫౌండేషన్” జూన్ 10న వ్యవసాయ యంత్ర పరికారల ప్రదర్శన నిర్వహించింది. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో...

X