rnf

17 Mar

కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై రైతు శిక్షణా కార్యక్రమం

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2019 మార్చి 17న ఆదివారం…. ప్రత్యేకంగా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నూతక్కికి చెందిన మహిళా రైతు శ్రీమతి ఉష పాల్గొంటారు. పంచగవ్వ, జీవామృతం,

11 Mar

రైతు నేస్తానికి పద్మ శ్రీ

రైతు నేస్తం కీర్తి కిరీటంలో పద్మశ్రీ చేరింది. పదిహేనేళ్లుగా కర్షకులకు సేంద్రీయ సాగులో విలువైన సలహాలిస్తూ చేదోడు వాదోడుగా నిలిచిన…. యడ్లపల్లి వెంకటేశ్వరరావు సేవను గుర్తించిన భారత ప్రభుత్వందేశంలో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందించింది. పార్లమెంటు హాల్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా యడ్లపల్లి వెంకటేశ్వరరావు...

06 Feb

రైతుకి సాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’

రైతుకు పెట్టుబడి సాయానికి ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని ప్రకటించింది. ఇందుకోసం 2019-20 బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించింది. అప్పుల ఊబిలో ఉన్న కర్షకులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు 2014లో సర్కారు...

18 Nov

సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల తయారీపై రైతు శిక్షణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2018 నవంబర్ 18 ఆదివారం సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల తయారీ విధానంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రైతు కొప్పుల శ్రీలక్ష్మీ పాల్గొని రైతు స్థాయిలో సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల తయారీపై శిక్షణ ఇస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి. ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 83675 35439, 97053 83666, 96767 97777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ...

11 Sep

రైతునేస్తం 2018 పురస్కారాలకు ఆహ్వానం

రైతునేస్తం 14వ వార్షికోత్సం సందర్భంగా సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఐ.వి. సుబ్బారావు పేరిట… వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అగ్రికల్చర్ జర్నలిస్టులతో పాటు విస్తరణ అధికారులను అవార్డులతో ఘనంగా సత్కరించనుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, రైతులు, వ్యవసాయ జర్నలిస్టులు వారి బయోడేటాతో పాటు పరిశోధనా వ్యాసాలు, సాగు అనుభవాలను 2018 సెప్టెంబర్ 20వ తేదీలోగా పంపాల్సిందిగా కోరుతున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలవారు దరఖాస్తులు పంపవచ్చు. దరఖాస్తు పంపాల్సిన చిరునామా ఎడిటర్, రైతునేస్తం, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ – 500004, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు – 040-...

03 Sep

“గాంధీ పథంలో.. కర్షక ప్రధాని” పుస్తక ఆవిష్కరణ

రైతు.. దేశానికి వెన్నెముక ఆకలి తీర్చే అన్నదాత అందుకే.. కర్షకుల సంక్షేమమే పాలకుల ప్రథమ కర్తవ్యం సాగు అనుకూల విధానాలతో నాటి నుంచి నేటి వరకు అనేక మంది పాలకులు రైతు బాంధవులయ్యారు వారిలో అగ్రభాగాన నిలుస్తారు మాజీ ప్రధానమంత్రి ఛౌదరీ చరణ్ సింగ్ రైతు నాయకుడిగా హక్కుల సాధన యోధుడిగా ఉద్యమాల సారథిగా చరణ్ సింగ్.. చిరస్మరణీయులు ఆ మహానేతపై డాక్టర్ యలమంచలి శివాజీ కలం నుంచి జాలువారిని పుస్తకం.. “గాంధీ పథంలో.. కర్షక ప్రధాని”. రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తక ఆవిష్కరణ కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఛౌదరీ అజిత్ సింగ్ చేతుల మీదుగా సెప్టెంబర్ 6న ఉదయం 10:30 గంటలకు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే. వేదిక – ది ఇండియన్ టుబాకో అసోసియేషన్ హాల్, జి.టి....

28 Aug

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

“రైతునేస్తం ఫౌండేషన్” ఆధ్వర్యంలో ఆగస్టు 28న(మంగళవారం) సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ కొత్తపేట రైతు బజార్ పక్కన గల బాబూ జగ్జీవన్ రాం హాల్ లో ఆగస్టు 28న మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి ఈ కార్యక్రమంలో పాల్గొని దేశీయ ఆహారం(సిరిధాన్యాలు మరియు కషాయాలు), ఆధునిక రోగాల (మధుమేహం, హృద్రోగాలు, విషజ్వరాలు, క్యాన్సర్ తదితర) నియంత్రణ మరియు నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు. కార్యక్రమం చివర్లో ప్రజల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కార్యక్రమం వేదిక వద్ద చిరుధాన్యాలు (అండు కొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, అరికెలు) అందుబాటులో ఉంటాయి. కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే....

20 Aug

ప్రకృతి సేద్యంలో కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై శిక్షణ

‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో… 2018 ఆగస్టు 26వ తేదీ ఆదివారం.. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నూతక్కికి చెందిన మహిళా రైతు శ్రీమతి ఉష, మరో రైతు ధర్మారం బాజి పాల్గొని పంచగవ్య, జీవామృతం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కషాయం, తులసి – కలబంద కషాయం, పచ్చగన్నేరు – కలబంద కషాయం, ఇంగువ ద్రావణం, పుల్లటి మజ్జిగ – శొంఠి కషాయం మొదలైన వాటి తయారీ, వాడకంపై అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా కొన్ని కషాయాలను ప్రత్యక్షంగా తయారుచేసి చూపిస్తారు....

16 Aug

ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగు శిక్షణ

పత్తి, మిరప సాగు చేస్తున్న రైతులా ? మేలైన సస్యరక్షణ చర్యల కోసం చూస్తున్నారా ? అయితే రండి… మీ కోసమే రైతునేస్తం ఏర్పాటు చేస్తోంది.. ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2018 ఆగస్టు 19న ‍‍(ఆదివారం‌‌‌) ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణలో మహబూబ్ నగర్ జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీమతి లావణ్య పాల్గొని.. ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగు విధానాలను వివరిస్తారు. విజయవాడకు చెందిన రహమతుల్లా…. వివిధ పంటల్లో చీడపీడల నివారణలో లింగార్షక బుట్టల ప్రాముఖ్యతను, పత్తిలో గులాబి...

X