వర్షాధార కూరగాయల సాగుకు ఇదే అనువైన సమయం

కాలువలు, బోర్లు, బావులు ఎక్కువగా లేని రోజుల్లో ఆహార పంటలు, కూరగాయలను ఖరీఫ్‌లో వర్షాధారంగా పండించేవారు. వర్షాధార కూరగాయల్లో టమాట, వంగ, మిరప ప్రధానమైనవి. గోరుచిక్కుడు, చిక్కుడు, ఉల్లి, తీగజాతికి చెందిన సొర, బీర, కాకర, దోసలను చిరుధాన్యాల్లో అంతరపంటలుగా విత్తి, ఆహార అవసరాలు తీర్చుకునేవారు. శాకాహారం ప్రధానమైన తెలుగు రాష్ట్రాలను కూరగాయల కరువు వెంటాడుతోంది. అందువల్ల మెట్ట పైర్లలో అంతరపంటలుగా కూరగాయల పెంపకం చేపట్టి, వాననీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందు కోసం.. బెట్టను, అధిక వర్షాలను తట్టుకోగల సూటిర కాలనే విత్తాలి. వీటి సాగు ఖర్చు తక్కువ. టమాట, వంగ, మిరప, ఉల్లి విత్తనాలను నారుపోసి నాటాలి. మిగతా వర్షాధార కూరగాయలను నేలలో తేమ చూసుకొని విత్తుకోవాలి. నాణ్యమైన అధిక...